Sunday, April 28, 2024

ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్స్ కలిసిన వేళ

- Advertisement -
- Advertisement -

సూపర్ స్టార్ రజనీకాంత్, కలెక్షన్ కింగ్ మోహన్‌బాబు ప్రాణ స్నేహితులనే విషయం అందరికీ తెలిసిందే. ఇటీవల రజనీకాంత్ ‘అణ్ణాత్త’ సినిమా షూటింగ్ కోసం హైదరాబాద్ వచ్చారు. ఆ సినిమా షూటింగ్ పూర్తయిన తర్వాత ఆయన చెన్నై వెళ్లే ముందు తన మిత్రుడు మోహన్ బాబు ఇంటికి వెళ్లారు. తాజాగా ఇదే విషయం చెబుతూ.. మోహన్ బాబు తనయుడు మంచు విష్ణు కొన్ని ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. రజనీకాంత్ రెండు రోజుల పాటు మోహన్‌బాబు ఇంట్లో ఉండి ఆయన ఫ్యామిలీతో సంతోషంగా గడిపారని చెప్పారు. ఈ సమయంలో రజనీకాంత్, మోహన్‌బాబు, మంచు విష్ణు కలిసి దిగిన ఫొటోలను ‘ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్స్ కలిసిన వేళ…’ అంటూ తన ట్విట్టర్ ఖాతా ద్వారా అభిమానులతో పంచుకున్నారు మంచు విష్ణు. ఇక ఆ తర్వాత బేగంపేట ఎయిర్‌పోర్ట్ నుంచి ప్రత్యేక విమానంలో రజనీకాంత్ చెన్నై వెళ్లారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News