Monday, April 29, 2024

తెలంగాణ మంత్రుల జాబితా విడుదల..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణ కేబినెట్ మంత్రుల జాబితా విడుదలైంది. ఇప్పటికే మంత్రుల జాబితాను గవర్నర్ తమిళిసైకి పంపించారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, దామోదర రాజనర్సింహలు, శ్రీధర్ బాబు, సీతక్క, కొండ సురేఖ, పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వర్ రావు, జూపల్లి కృష్ణారావు, పొంగులేటి శ్రీనివాస రెడ్డి, సుదర్శన్ రెడ్డిలకు మంత్రి పదవులు దక్కాయి. రేవంత్ రెడ్డితో పాటు మరికాసేపట్లో మంత్రులుగా వీరు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. భట్టి విక్రమార్క డీప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

గురువారం మధ్యాహ్నం 1.04నిమిషాలకు నగరంలోని ఎల్బీ స్టేడియంలో తెలంగాణ మంత్రులు ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి హాజరయ్యేందుకు కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా, ప్రియాంక, రాహుల్ గాంధీలు ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి వారికి ఘన స్వాగతం పలికారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News