Tuesday, April 30, 2024

తెలంగాణ డయాగ్నోస్టిక్స్ పేదలకు వరం

- Advertisement -
- Advertisement -

సూర్యాపేట : అనారోగ్యాల భారీనపడే పేద ప్రజలకు భారంగా మారే వైద్య పరీక్షలను ఉచితంగా అందించేందుకే సీఎం కేసీఆర్ తెలంగాణ డయాగ్నోస్టిక్స్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని మెడికల్ కళాశాల ఆసుపత్రి ఆవరణంలో డయాగ్నస్టిక్ హబ్‌ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన టీ డయాగ్నస్టిక్ హబ్ పేదలకు వరంగా మారిందన్నారు. టీ డయాగ్నోస్టిక్ ద్వారా అందిస్తున్న 134 రకాల వైద్య పరీక్షను సద్వినియోగం చేసుకోవాలన్నారు.

ప్రజలు తమ మండల కేంద్రాన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో తమ నమూనాను అందజేస్తే నేరుగా తమ చరవాణికి తమ టెస్టులకు సంబంధించిన వివరాలను అందించే విధంగా ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. జిల్లా కేంద్రానికి దూరంగా ఉన్న గ్రామీణ ప్రాంత ప్రజలు ఈ అవకాశాన్ని ప్రాథమిక కేంద్రాలు, బస్తీ దవాఖానా, పల్లె దవాఖానాల ద్వారా సద్వినియోగం చేసుకోవాలన్నారు. టీ డయగ్నోస్టిక్‌పై ఆశ కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, అధికార యంత్రాంగం ప్రజలను చైతన్యం చేయాలని సూచించారు. ఈ కేంద్రంలో మహిళలు బ్రెస్ట్, సర్వైకల్ క్యాన్సర్ వంటి భారీన పడుతున్నారని గుర్తించిన సీఎం కేసీఆర్ క్యాన్సర్లను ముందుగానే గుర్తించే మమోగ్రఫీ టెస్టును టీ డయాగ్నోస్టిక్ హబ్‌లో అందుబాటులో తీసుకవచ్చినట్లు తెలిపారు.

మహిళలకు తమ ఆరోగ్య పట్ల ఏలాంటి చిన్నపాటి అనుమానం వచ్చిన ఆశ కార్యకర్తలను సంప్రదించి మమోగ్రఫీ స్కీనింగ్ టెస్టును చేయించుకోవాలన్నారు. సామాన్య ప్రజలు ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్లి ఆర్థిక ఇబ్బందులు పడకుండా ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందిస్తున్న అన్ని రకాల వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ వైద్య రంగంలో తీసుకుంటున్న విప్లవాత్మక నిర్ణయాలతో దేశంలోనే తెలంగాణ మొదటి స్థాన ంలో నిలిచిందన్నారు.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం టీ డయగ్నోస్టిక్ హబ్‌ను ఏర్పాటు చేయడంతో సకాలంలో, సమీపంలో నాణ్యమైన వై ద్య పరీక్షలు అందుబాటులోకి తీసుకవచ్చినట్లు తెలిపారు. మెడికల్ కళాశాలలో ప్రజలకు మరింత సేవలు అందించేందుకు సకల సదుపాయాలతో భవన నిర్మాణాలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. అనంతరం ఆసుపత్రి ఆవరణంలో ఖాళీ స్థలాన్ని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ పెరుమాళ్ళ అన్నపూర్ణ, మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ శారదా, జనరల్ ఆసుపత్రి సూపరింటెండె ంట్ దండా మురళిధర్‌రెడ్డి, బీఆర్‌ఎస్ నాయకులు గండూరి ప్రకాష్, బైరు వెంకన్న గౌడ్, శబరి, రాపర్తి శ్రీనివాస్ గౌడ్, టీడయాగ్నోస్టిక్ మేనేజర్ సధాకర్ రెడ్డి, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News