Tuesday, April 30, 2024

కాంగ్రెస్‌లో ప్రజాస్వామ్యం, సమష్టి నాయకత్వం ఎక్కువ: డికె శివకుమార్

- Advertisement -
- Advertisement -

కాంగ్రెస్‌లో ప్రజాస్వామ్యం, సమష్టి నాయకత్వం ఎక్కువ
ప్రపంచమంతా తెలంగాణ ఎన్నికల వైపు చూస్తోంది
కర్ణాటక ఉపముఖ్యమంత్రి డికె శివకుమార్
మనతెలంగాణ/హైదరాబాద్: కర్ణాటకలో వచ్చిన ఫలితమే తెలంగాణలో వస్తుందని కర్ణాటక ఉపముఖ్యమంత్రి డికె శివకుమార్ తెలిపారు. కాంగ్రెస్‌లో ప్రజాస్వామ్యం, సమష్టి నాయకత్వం ఎక్కువని ఆయన అన్నారు. హైదరాబాద్‌లో ఆయన మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా దేశమే కాదు ప్రపంచమంతా తెలంగాణ ఎన్నికల వైపు చూస్తోందన్నారు. తాను తెలంగాణలో అనేక నియోజకవర్గాల్లో తిరిగానని తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారన్నారు. తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీకి బహుమతి ఇవ్వాలని డికె శివకుమార్ కాంగ్రెస్ కార్యకర్తలకు సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లోని అన్ని వర్గాల ప్రజలు కాంగ్రెస్ పాలన కోసం ఎదురు చూస్తున్నారని ఆయన తెలిపారు. రాష్ట్రంలో డిసెంబర్ 9వ తేదీన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తామని ఆయన భరోసా ఇచ్చారు. కర్ణాటకలో కాంగ్రెస్ ఇచ్చిన గ్యారెంటీలను అమలు చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. కర్ణాటక రైతులకు తమ ప్రభుత్వం ఉచిత కరెంట్ ఇవ్వడం ప్రారంభించిందని ఆయన వెల్లడించారు. కర్ణాటకలో నిత్యావసర ధరలు పెరిగాయని ఆరోపణ చేస్తున్న నాయకులు తమ రాష్ట్రం వచ్చి చూడాలని శివకుమార్ సూచించారు. కర్ణాటక ప్రజలకు 5 గ్యారంటీలు అమలు అవుతున్నాయని ఆయన స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు విస్తరించి ఉందని ఒక్కో రాష్ట్రంలో ఒక్కో అవసరం ఉంటుందన్నారు. రాష్ట్ర ప్రజలకు అనుగుణంగా పథకాలు ఉంటాయని ఆయన తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News