Friday, May 3, 2024

కోటి మార్కు దాటిన టీకా

- Advertisement -
- Advertisement -
Telangana govt distributed one crore vaccine in five months
అత్యధికంగా హైదరాబాద్, అత్యల్పంగా నారాయణపేట్‌లో పంపిణీ, 161 రోజుల నుంచి నిర్విరామంగా కొనసాగుతున్న ప్రక్రియ, డోసులు సకాలంలో రాకనే కాస్త ఆలస్యమైందంటున్న అధికారులు

 

హైదరాబాద్ : రాష్ట్రంలో టీకా పంపిణీ కోటి మార్కు దాటింది. జూన్ 16 నుంచి ఇప్పటి వరకు 1,00,53,358 డోసులు పంపిణీ చేయగా, వీటిలో 86, 06,292 మొదటి, 14,47,066లను రెండో టీకా కోసం వినియోగించినట్లు ఆరోగ్యశాఖ పేర్కొంది. అయితే అత్య ధికంగా హైదరాబాద్‌లో 22,30,655 డోసులు పంపిణీ చేయగా, అతి తక్కువగా నారాయణపేట్‌లో కేవలం 50, 818 డోసులు వేశారు. అదే విధంగా ఆదిలాబాద్‌లో 86, 822, భద్రాద్రి కొత్తగూడెంలో 2,28,634, జగిత్యాల 2,07,059, జనగామ 94,757, భూపాలపల్లి 1,13, 136, గద్వాల 74,102, కామారెడ్డి 2,23,689, కరీం నగర్‌లో 3,05,215, ఖమ్మంలో 2,94,824, కోమురం భీం 62,491, మహబూబాబాద్ 1,55,638, మహబూ బ్‌నగర్ 1,50,480, మంచిర్యాల 1,58,737, మెదక్ 1,56,652, మేడ్చల్ 11,86,140, ములుగు 76,270, నాగర్‌కర్నూల్ 1,32,258, నల్గొండ 2,39,177, నిర్మ ల్ 1,66,107, నిజామాబాద్ 2,66,096, పెద్దపల్లి 2, 11,150, సిరిసిల్ల 1,45,120, రంగారెడ్డి 12,78,287, సంగారెడ్డి 29,2,544, సిద్ధిపేట్ 2,89,719, సూర్యా పేట్ 2,05,985, వికారాబాద్ 1,02,659, వనపర్తి 82,648,వరంగల్ రూరల్ 95,886, వరంగల్ అర్బన్ 4,28,804, యాదాద్రిలో 2,60,799 డోసులను పం పిణీ చేసినట్లు ఆరోగ్యశాఖ ప్రభుత్వానికి నివేదిక సమ ర్పించింది.

మొదటి డోసులో ఆ జిల్లాలే ముందు..

టీకా మొదటి డోసు పంపిణీలోనూ హైదరాబాద్ అత్యధి కంగా 19,19,324 టీకాలు వేయగా, రెండో స్థానంలో రంగారెడ్డి 11,31,432 డోసులు, మూడవ స్థానంలో మేడ్చల్ 10,17,204డోసులను పంపిణీ చేశాయి. అదే విధంగా 3,62,738 డోసుల పంపిణీతో వరంగల్ అర్బ న్ నాల్గవ స్థానంలో నిలువగా, 2,67,295తో కరీంనగర్ ఐదవ స్థానంలో నిలిచింది. ఇక రెండు డోసు ఫస్ట్ ప్లేస్‌లోనూ హైదరాబాద్ 3,11,331 డోసులను పంపిణీ చేసింది. తర్వాత 1,68,936తో మేడ్చల్, 1,46,855 తో రంగారెడ్డి, 66,066తో వరంగల్ అర్బన్, 43,556 తో భద్రాద్రి కొత్తగూడెం ఐదవ స్థానంలో ఉన్నాయి.

161 రోజుల నుంచి..

రాష్ట్రంలో జూన్ 16న టీకా పంపిణీ కార్యక్రమం ప్రారం భమైంది. తొలి విడత హెల్త్‌కేర్, ఆ తర్వాత ప్రంట్‌లైన్ వర్కర్లకు టీకాలు వేశారు. తదనంతరం 45 ఏళ్ల పై బడిన కో మార్పిడ్, తర్వాత 45 పై బడిన వారందరికీ క్రమక్ర మంగా టీకాలు ఇచ్చారు. అయితే టీకాలు ఉత్పత్తి తక్కు వగా ఉండటంతో తెలంగాణ ప్రత్యేక ప్రణాళికతో ముం దుకు వెళ్తుంది. కేంద్రం నుంచి వచ్చే డోసులు సప్లాయ్‌ను బట్టి హైరిస్క్, సూపర్ స్ప్రెడర్లు, మహిళా సంఘాలు, టీచర్లు ఇలా విడతల వారీగా ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్ అందించేందుకు ప్రభుత్వం అన్ని రకాల ఏర్పాట్లు చేసిం ది. రాష్ట్ర వ్యాప్తంగా 45 పైబడిన వారు 92,58,061 మంది ఉండగా, వీరిలో ఇప్పటివరకు 40,95,031 మం ది వ్యాక్సిన్ తీసుకున్నారు. అదే విధంగా 18 నుంచి 44 ఏళ్ల వయసులో కోటి 81 లక్షల 13 వేల 735 మంది ఉండగా కోటి 53,90,824 మందికి టీకా ఇచ్చారు.

ఇబ్బందుల్లేకుండా వ్యాక్సినేషన్

రాష్ట్ర వ్యాప్తంగా ఇబ్బందులు లేకుండా వ్యాక్సినేషన్‌ను ని ర్వహిస్తున్నాం. డోసుల ఉత్పత్తిని బట్టి, హైరిస్క్ గ్రూప్‌లను ఎంపిక చేసి ప్రత్యేకంగా టీకాల పంపిణీని చేపట్టాం. గడి చిన 161 రోజులుగా హైదరాబాద్‌తో పాటు జిల్లాల్లోనూ వ్యాక్సినేషన్ నిర్వహణ అద్భుతంగా సాగుతోంది. ఎప్పటి కప్పుడు ప్రజలకు అవగాహన కల్పిస్తూ, టీకా పంపిణీని స జావుగా కొనసాగిస్తున్నాం. కేంద్రం నుంచి సకాలంలో టీ కాలు వచ్చివుంటే మరింత వేగంగా చేసేవాళ్లం. ప్రస్తుతాని కి ప్రతి రోజూ 10లక్షల మందికి టీకా ఇచ్చే సామర్ధానికి చేరుకున్నాం. రాబోయే రోజుల్లో టీకా పంపిణీలో వేగం పెంచుతాం. ఆగస్టు చివరివరకు సుమారు 50శాతం మం దికి టీకా పంపిణీ చేస్తాం. అర్హులైన ప్రతి ఒక్కరూ టీకా వేసుకొని కరోనా నియంత్రణకు సహకరించాలి.

– డా.జి. శ్రీనివాసరావు, రాష్ట్ర వ్యాక్సినేషన్ ఆఫీసర్

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News