Tuesday, April 30, 2024

పంటల సాగులో భారీ మార్పులు

- Advertisement -
- Advertisement -
Telangana huge changes in crop cultivation
యాసంగిలో సొంత అవసరాలకే ఇక వరిసాగు
 ప్రత్యామ్నాయ పంటలకు ప్రోత్సాహం

హైదరాబాద్ : రాష్ట్ర వ్యవసాయరంగ ముఖచిత్రం మారిపోతోంది. ప్రభుత్వ నిర్ణయాలతో పం టల సాగులో భారీ మార్పులు చోటు చేసుకోబొతున్నాయి. మార్కెట్‌లో వినియోగదారుల అవసరాలకు తగ్గట్టు గా పంటల సాగుకు ప్రాధాన్యత పెరుగుతోంది. సోమవారం రాష్ట్ర మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాల మేరకు రైతులను కూడా ఆ దిశగా పంటల సాగుకు సన్నద్దం చేసేందుకు వవ్యసాయశాఖ యాసంగి పంటల సాగు ప్రణాళిక సిద్దం చేస్తోంది. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో యాసంగి వరిధాన్యం కొనేది లేదని తెగేసి చెప్పిన నేపధ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా రైతుల విశాల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని వరిసాగుపై కీలక నిర్ణయం తీసుకుంది. యాసంగిలో వరిసాగును ఏ మాత్రం ప్రోత్సహించరాదని మంత్రివర్గ సమావేశంలో నిర్ణయించినట్టు ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రకటించారు. యాసంగిలో రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయదని వెల్లడించారు. ప్రభుత్వ నిర్ణయాలకు తగ్గట్టుగానే వ్య వసాయశాఖ యాసంగి కార్యాచరణకు సిద్దమవుతోంది.

రాష్ట్రంలో యాసంగి సీజన్ కింద అన్ని రకాల పంటలు కలిపి46.49లక్షల ఎకరాల విస్తీర్ణంలో సాగు చేయించాలని ఇప్పటికే ప్రతిపాదించింది. అందులో 31.01లక్షల ఎకరాల విస్తీర్ణంలో వరిసాగు అంచనా వేసింది. అయితే ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో వరిసాగు విస్తీర్ణం బాగా తగ్గిపోనుంది. రాష్ట్ర ప్రజల తిండిగింజల అవసరాలకు మాత్రమే వరిసాగు పరిమితం కానుంది. ఎవరైన సొంత భరోసాతో లేదా విత్తన కంపెనీలకు విక్రయించుకునేందుకు అగ్రిమెంట్‌పై వరిసాగుకు అవకాశం కల్పించింది. బియ్యం వ్యాపారులతో లేదా రైస్‌మిల్లులతో ధా న్యం కొనుగోలుకు ఒప్పందాలు కుదుర్చుకుంటే రైతులు తమసొంత భరోసాపైనే వరిసాగుకు అవకాశాలు కల్పించింది. ఇక ఇతరత్రా రైతులు సాగునీటి వనరులు అందుబాటులో ఉన్నాయికదా అన్న అభిప్రాయంతో వరిసాగు చేసుకుంటే పండిన పంటను మార్కెట్లో అమ్ముకోగలమ న్న ధమ్ము ధైర్యం ఉన్న రైతులు మాత్రమే వరిసాగు చేసుకోవచ్చు. ప్రభుత్వం వరిసాగు పట్ల ఎక్కడా ఎవరినీ ని ర్భందం చేయకుండానే పంట దిగుబడి వచ్చాక ధాన్యాన్నిబహిరంగమార్కెట్లో విక్రయించుకునే స్వేచ్చను కూడా క ల్పించింది. వరిసాగుపై ప్రతిపక్ష పార్టీలకు రాష్ట్ర ప్రభుత్వంపైన విమర్శలు చేసే అవకాశం లేకుండా చేసింది.

వరికి ప్రత్యామ్నాయంగా ఆరుతడి పంటలు

రాష్ట్ర ప్రభుత్వం వరిసాగుకు ప్రత్యామ్నాయ పంటలను ఇప్పటికే రైతులముందు ఉంచింది. నీటి ఆధారం ఉన్న ప్రాంతాల్లో ఆరు తడి పంటలను ప్రోత్సహించేందకు చ ర్యలు చేపట్టింది. పప్పుధాన్య పంటలు, నూనె గింజ పం టల సాగుద్వారా దిగుబడులు, లాభాలను కళ్లకు కడుతోంది. యాసంగిలో కంది, శనగ, మినుము, పెసర, ఉలవ తదితర పంటలసాగును ప్రోత్సహిస్తోంది. పప్పుధాన్య పంటలకు మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉన్న నేపధ్యంలో ఈ పంటల సాగును పెద్ద ఎత్తున చేపట్టేందుకు ప్రభు త్వం గ్రామ స్థాయిల్లో రైతులకు అవగాహన కార్యక్రమా లు నిర్వహించాలని జిల్లా కలెక్టర్లకు , వ్యవసాయశాఖ అధికారులకు ఆదేశాలిచ్చింది. మరోవైపు నూనెగింజల సాగును కూడా ప్రోత్సహిస్తోంది. యాసంగిలో వేరుశనగ, పొద్దుతిరుగుడు, నువ్వులు, కుసుమలు, వెర్రినువ్వులు , ఆవాలు తదితర నూనెగింజపంటల సాగు లాభదాయకంగా ఉంటుందని రైతులకు సూచిస్తోంది. మారుతున్న యాసంగి పంటల ప్రణాళిక మేరకు ఈసారి రికార్డులు స్ధాయి లో పప్పుధాన్యాలు, నూనెగింజ ప ంటలు సాగులోకి వచ్చే అవకాశా లు ఉన్నట్టు అధికారుల అంచనా.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News