Thursday, May 2, 2024

ఇవీ తెలంగాణ మంత్రుల విద్యార్హతలు

- Advertisement -
- Advertisement -

తెలంగాణా మంత్రివర్గంలో ఎక్కువమంది విద్యాధికులున్నారు. ఆరోగ్య, వైద్య, కుటుంబ సంక్షేమ శాఖా మంత్రి దామోదర్ రాజనర్సింహ ఇంజనీరింగ్ లో పట్టా అందుకుంటే, సీతక్క పిహెచ్ డి చేశారు. రాజనరసింహ బిఇ (సివిల్) చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిగ్రీ చేశారు. ఆయన 1992లో ఏవీ కాలేజీనుంచి బిఏ పట్టా తీసుకున్నారు. మంత్రుల విద్యార్హతలకు సంబంధించి అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడిఆర్) తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.

ఆర్థిక శాఖను నిర్వహిస్తున్న భట్టి విక్రమార్క హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీలో ఎంఏ (హిస్టరీ) చదివారు. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి 1981లో నేషనల్ డిఫెన్స్ అకాడెమీనుంచి బిఎస్సీ పట్టా తీసుకున్నారు. అలాగే ఎయిర్ వార్ ఫేర్ కాలేజీనుంచి 1985లో వెపన్స్ ఎంప్లాయ్ మెంట్ కోర్సు కూడా చేశారు.

ఇక కోమటిరెడ్డి వెంకటరెడ్డి హైదరాబాద్ లోని ఎన్.బి. సైన్స్ కాలేజీలో ఇంటర్మీడియెట్ పాసయ్యారు. దుద్దిళ్ళ శ్రీధర్ బాబు ఢిల్లీ యూనివర్శిటీలో ఎల్.ఎల్.బి, హైదరాబాద్ యూనివర్శిటీలో ఎంఎ చదివారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి కల్లూరులోని ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఇంటర్మీడియెట్ చదివారు.

పొన్నం ప్రభాకర్ ఉస్మానియా యూనివర్శిటీలో ఎంఏ (పొలిటికల్ సైన్స్) చదివారు. కొండా సురేఖ వరంగల్ లోని లాల్ బహదూర్ డిగ్రీ కాలేజీనుంచి బికాం పట్టా తీసుకున్నారు. తుమ్మల నాగేశ్వరరావు ఉస్మానియా యూనివర్శిటీనుంచి బికామ్ డిగ్రీ పొందారు. జూపల్లి కృష్ణారావు పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News