Sunday, April 28, 2024

సింగిల్‌లేన్ నుంచి డబుల్ లేన్‌లుగా పరిణతి…

- Advertisement -
- Advertisement -

ఎనిమిదేళ్లలో ఆర్ అండ్ బి అద్భుత ప్రగతి
7,928 కి.మీ రాష్ట్ర రహదారులు 2 లేన్లుగా అభివృద్ధి

మనతెలంగాణ/హైదరాబాద్:  ఎనిమిదేళ్ల పాలనలో తెలంగాణ అద్భుతమైన ప్రగతిని సాధించింది. రాష్ట్రం ఏర్పడినప్పుడు రహదారుల పరిస్థితి అత్యంత అధ్వాన్నంగా ఉండేది. జాతీయ రహదారులు చాలా తక్కువగా ఉండేవి. ఆర్‌అండ్‌బి రోడ్లలో 70 శాతం సింగిల్ లేన్ రోడ్లే. పంచాయతీరాజ్ పరిధిలో ఎక్కువ శాతం మట్టి రోడ్లే. అన్ని రోడ్లు కనీసం మరమ్మతులకు నోచుకోకుండా గుంతలు పడి, రాకపోకలకు ఇబ్బందికరంగా మారేవి. ప్రజలకు రవాణా సౌకర్యం కల్పించాల్సిన రహదారులు నరకాలకు నకళ్లుగా ఉండేవి. రహదారుల పరిస్థితిని మెరుగుపర్చడం ద్వారా తెలంగాణలో ప్రగతిబాటలు నిర్మించాలని నిర్ణయించింది. అందులో భాగంగా రోడ్లు, భవనాల శాఖ 32,445 కిలోమీటర్ల రహదారులను నిర్వహిస్తోంది. ఇందులో 27,734 కిలోమీటర్ల రాష్ట్ర రహదారులు కాగా, 4,983 కిలోమీటర్ల జాతీయ రహదారులు రాష్ట్రాన్ని దాటుతున్నాయి, వీటిలో 2,682 కిలోమీటర్లు ఎన్‌హెచ్‌ఏఐ, 2,301 కి.మీలు రాష్ట్ర ఆర్ అండ్ బి, ఎన్‌హెచ్‌ఏ నియంత్రణలో ఉన్నాయి. వీటితో పాటు మేజర్ డిస్ట్రిక్‌రోడ్లు 14,584 కి.మీల మేర ఉన్నాయి.

రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి రూ.16,030 కోట్లతో…

రాష్ట్రం ఏర్పడే సమయానికి, రాష్ట్ర ఆర్ అండ్ బి రోడ్ల మొత్తం 24,245 కి.మీ రోడ్ల పొడవులో, కేవలం 27.9 శాతం రోడ్డు పొడవు రెండు లేన్లు అంతకంటే ఎక్కువగా ఉన్నాయి. రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి రూ.16,030 కోట్లతో 7,928 కి.మీల మేర రాష్ట్ర రహదారులను 2 లేన్లుగా నిర్మాణం చేపట్టి పూర్తి చేశారు. ఇప్పుడు రాష్ట్ర రహదారుల 2 లేన్ పొడవు 12,921 కి.మీలు. అదేవిధంగా జూన్ 2014లో నాలుగు లేన్ అంతకంటే ఎక్కువ పొడవు 1029 కి.మీలు. రాష్ట్ర రహదారుల పునరుద్ధరణలు రూ. 4,118 కోట్లతో 13,740 కి.మీల మేర ఆర్ అండ్ బి పనులు చేపట్టగా ఇందులో 8,621 కి.మీ పొడవు రూ.2,141 కోట్లతో పూర్తయ్యాయి.

 

రాష్ట్ర రహదారులపై వంతెనలు..

వాగులు, నదుల మధ్య అంతరాలను పూడ్చడంతో వాటిని వెడల్పు చేయడానికి ప్రభుత్వం అధికంగా నిధులను వెచ్చించింది. 541 వంతెనల పునర్నిర్మాణంతో వాటిని వెడల్పు చేయడానికి రూ. 2,763 కోట్లను వెచ్చించింది. అందులో 350 వంతెనల పనులను రూ. 1405 కోట్లతో పూర్తి చేశారు. మిగిలిన 191 వంతెనల పనులు జరుగుతున్నాయి. వీటితో పాటు 184 బ్రిడ్జిలను చెక్‌డ్యాంలతో గృహ నిర్మాణాలను చేపట్టి 130 నిర్మాణాలను పూర్తి చేశారు.

రేడియల్ రోడ్డు నిర్మాణం

ఔటర్ రింగ్ రోడ్డుకు వేగంగా చేరుకునేలా రూ. 761 కోట్లతో 4 రేడియల్ రోడ్లను 38 కి.మీ పనులు ప్రస్తుతం పురోగతిలో ఉన్నాయి.
రోడ్ల రెన్యువల్స్ చేయడంలో భాగంగా రూ. 5051 కోట్లతో 14,873 కి.మీలు, రూ.2273 కోట్లతో 155 బ్రిడ్జిల పనులను రెన్యూవల్ చేసి 8064 కి.మీల మేర పనులను ఆర్ అండ్‌బి శాఖ పూర్తి చేసింది.
గ్రామీణ రోడ్ల నిర్మాణాలు..
గ్రామీణ రోడ్ల నిర్మాణాల్లో భాగంగా రూ.1205 కోట్లతో 329 పనులను చేపట్టి 1308 కి.మీల మేర పనులను పూర్తి చేశారు.

రాష్ట్రంలో 30 జాతీయ రహదారులు

 

రాష్ట్రంలో 30 జాతీయ రహదారులు రాష్ట్రవ్యాప్తంగా 4,983 కి.మీ పొడవునా ఉండగా ఇందులో 2,682 కి.మీ అభివృద్ధి కోసం వద్ద ఎన్‌హెచ్‌ఏఐ, 2301కి.మీలు రాష్ట్ర ఆర్ అండ్ బినియంత్రణలో రోడ్లు ఉన్నాయి. ఎనిమిది సంవత్సరాల్లో రూ.19,056 కోట్లతో 2199 కి.మీల మేర జాతీయ రహదారులకు సంబంధించి 81 పనులు మంజూరు చేశారు. 1223 కి.మీల జాతీయ రహదారులను రెండు లైన్లుగా అభివృద్ధి చేశారు. రాష్ట్రం ఏర్పడ్డాక రూ.6687 కోట్లతో జాతీయ రహదారుల అభివృద్ధి కోసం ఖర్చు చేశారు.

వివిధ రాష్ట్ర ప్రభుత్వ శాఖలకు కేటాయించిన భవనాల నిర్మాణం

వివిధ రాష్ట్ర ప్రభుత్వ శాఖలకు కేటాయించిన భవనాల నిర్మాణం, నిర్వహణ బాధ్యతను ఆర్ అండ్ బి విభాగం నిర్వహిస్తుంది. మొత్తం ప్లింత్ ఏరియా 112.73 లక్షల చదరపు అడుగులు (నివాస భవనాలు – 57.84 లక్షల చ.అ., నివాస భవనాలు – 54.89 లక్షల చ.అ.) భవనాల విభాగం నిర్వహణలో ఉంది.
29 జిల్లాలో కలెక్టరేట్ కాంప్లెక్స్‌ల నిర్మాణాలు ప్రారంభం

రహదారులు, భవనాల శాఖ పర్యవేక్షణలో 29 జిల్లాలో కలెక్టరేట్ కాంప్లెక్సుల నిర్మాణాలు ప్రారంభంకాగా 15 జిల్లాలో ఇప్పటికే అవి పూర్తి కాగా 11 పురోగతిలోనూ 3 జిల్లాలో ఇంకా ప్రారంభం కావల్సి ఉంది. వీటితో పాటు కలెక్టర్, అడిషనల్ కలెక్టర్, జిల్లా స్థాయి అధికారులకు రెసిడెన్షియల్ క్వార్టర్ల నిర్మాణం పనులను చేపట్టారు.
ఏడు లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో, ఏడు అంతస్తుల్లో…

 

డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ నూతన సచివాలయ భవన నిర్మాణాన్ని ప్రభుత్వం చేపట్టింది. ఏడు లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో, ఏడు అంతస్తుల్లో సచివాలయం నిర్మాణం అవుతోంది. మంత్రులుండే అంతస్తుల్లోనే వారి శాఖల కార్యదర్శుల, సెక్షన్ల కార్యాలయాలు ఉంటాయి. అధునాతన హంగులతో సచివాలయం ముస్తాబవుతోంది. దీంతోపాటు హుస్సేన్‌సాగర్ తీరంలో 125 అడుగుల ఎత్తుతో డాక్టర్ అంబేద్కర్ విగ్రహాన్ని ప్రభుత్వం ప్రతిష్టించబోతోంది. తెలంగాణ పోరాటంలో అసువులుబాసిన అమరవీరులను స్మరిస్తూ రాష్ట్ర సచివాలయానికి ఎదురుగా, లుంబినీ పార్కు సమీపంలో అమర వీరుల స్మారక స్థూపాన్ని ప్రభుత్వం నిర్మిస్తోంది. ప్రస్తుతం పనులు పురోగతిలో ఉన్నాయి. ఎమ్మల్యే క్వార్టర్‌లో ఐటి బ్లాక్, సెంటర్ ఫర్ దళిత స్టడీస్, మెడికల్ కళాశాలలు, నర్సింగ్ కళాశాలలు, 4 సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల నిర్మాణ పనులు రహదారుల భవనాల శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. ప్రస్తుతం ఉన్న ఔటర్ రింగ్‌రోడ్డుకు అదనంగా రీజనల్ రింగ్ రోడ్డును నిర్మించాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. ప్రస్తుత ఔటర్ రింగ్ రోడ్ కు 30 కిలోమీటర్ల అవతల 340 కిలోమీటర్ల పొడవున రీజనల్ రింగ్ రోడ్డు నిర్మాణం కానుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News