Sunday, December 15, 2024

తెలంగాణలో 3,34,26,323 మంది ఓటర్లు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/ హైదరాబాద్: తెలంగాణ రా ష్ట్రంలో ప్రస్తుతం 3,34,26,323 మంది ఓటర్లు నమోదై ఉన్నారని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (టి సీఈఓ) సుదర్శన్ రెడ్డి స్పష్టం చేశారు. బిఆర్‌కె భవన్‌లోని ఎన్నికల సంఘం కార్యాలయంలో శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మార్పులు, చేర్పుల తర్వా త రూపొందించిన జాబితా వివరాలను వెల్లడించారు. ఓటరు జాబితా ప్రక్షాళనలో భాగంగా నా లుగు లక్షల ఓట్లను తొలగించామని చెప్పారు. గత నెల 29న ఓటర్ల ముసాయిదా జాబితాను ప్రకటించినట్లు తెలిపారు.

ఇప్పటికి 8,02,805 మంది కొత్త ఓటర్లు తమ పేర్లను నమోదు చేసుకున్నారని వివరించారు. కాగా ఓటర్ల జాబితా నుం చి వివిధ కారణాలతో 4.14 లక్షల ఓటర్లను తొలగించినట్లు వెల్లడించారు. ఓటర్ల జాబితాలో యు వ ఓటర్లు 4,73,838 మంది నమోదు చేసుకున్నారని తెలిపారు. ఈ ఓటర్ల జాబితపై అభ్యంతరాలను ఈనెల 28 వరకు స్వీకరిస్తామని చెప్పా రు. జనవరి 6న ఓటర్ల తుది జాబితాను ప్రకటిస్తామని వెల్లడించారు. ఈనెల 9,10 తేదీల్లో ఓటర్ల నమోదుకు ప్రత్యేక ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నట్లు తెలిపారు. బీఎల్‌ఓలు ఉద యం నుంచి సాయంత్రం వరకు పోలింగ్ స్టేషన్ల లో అందుబాటులో ఉండాలని సూచించారు. ఉ పాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎస్జీటీలకు ఓటు హక్కు లేదని ప్రధానాధికారి తేల్చి చెప్పారు.

హైదరాబాద్‌లో అత్యధికంగా ఓట్ల తొలగింపు
ఓటరు జాబితా ప్రక్షాళనలో భాగంగా అత్యధిక ఓట్లను హైదరాబాద్ జిల్లాలో తొలగించినట్లు ఎన్నికల ప్రధానాధికారి తెలిపారు. హైదరాబాద్ జిల్లాలో 1,29,880 ఓట్లను తొలగించారు. ఇందులో 7730 మంది చనిపోయారని, 22677 ఓటర్లు రెండు అంత కంటే ఎక్కువ సార్లు ఓటర్లుగా ఉన్నారని, మరో 99,379 మంది వేరే చో టకు షిప్ట్ అయ్యారని ఎన్నికల సంఘం వెల్లడించింది. ఆ తర్వాత రంగారెడ్డి జిల్లాలో 58,120, మేడ్చల్‌లో 34680, కరీంనగర్ జిల్లాలో 21, 463, నల్గొండ జిల్లాలో 12,956 ఓట్లను తొ లగించినట్లు స్పష్టం చేశారు. కాగా కొత్త ఓట్ల నమోదులోనూ హైదరాబాద్ జిల్లా ముందుందని ఎన్నికల అధికారి వెల్లడించారు. ఈ జిల్లాలో 1.81లక్షల మంది ఓటర్లు కొత్తగా నమోదు అయ్యారు. రంగా రెడ్డి జిల్లాలో 1.18 లక్షల మంది, మేడ్చల్ జిల్లాలో 99696 మంది కొత్త ఓటర్లుగా నమోదు అయ్యారు.

రాష్ట్రంలో మొత్తం ఓటర్లు 3,34,26, 323 మంది ఉండగా వారిలో పురుష ఓటర్లు 1,66,16,446, మహిళా ఓటర్లు 1,68,07,10 0, ట్రాన్స్ జెండర్ ఓటర్లు 2,777, సర్వీసు ఓట ర్లు 15,200, 18, 19 వయస్సు ఉన్న యువ ఓ టర్లు 4,73,838, 85 ఏండ్లు పైబడిన సీనియర్ సిటిజన్స్ 2,25,462, దివ్యాంగులు – 5,28,0 85, ఓవర్ సీస్ ఓటర్లు – 3578 మంది ఉన్నారని ఎన్నికల ప్రధానాధికారి సుదర్శన్‌రెడ్డి తెలిపారు. ఇంటింటి ఓటరు జాబితాలో భాగంగా కొత్తగా ఓట్ల నమోదు చేసిన వారు – 8,02,805 ఉండగా, తొలగించిన ఓటర్లు – 4,14,165, సవరణలు, దిద్దుబాట్లు జరిగిన ఓటర్ల సంఖ్య – 5,93,956గా ఉందని వివరించారు. కాగా రాష్ట్రంలో పొలింగ్ కేంద్రాల సంఖ్య 35907 కాగా కొత్త పొలింగ్ కేంద్రాలు 551 ఏర్పాటయ్యాయని తెలిపారు. ఈ పోలింగ్ కేంద్రాలు ఉన్న ప్రాంతాలు 19,942 ఉండగా వీటిలో పట్టణాల్లో 6,001 పోలింగ్ ప్రాంతాలు, గ్రామీణ ప్రాంతాల్లో పోలింగ్ ప్రాం తాలు 13,941 ఉన్నాయని చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News