Sunday, April 28, 2024

దేశానికే దిక్సూచిలా మారనున్న తెలంగాణ వార్డు కార్యాలయాలు

- Advertisement -
- Advertisement -

గన్‌ఫౌండ్రీ: ప్రభుత్వ అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండేందుకు వార్డు కార్యాలయాలను రాష్ట్ర వ్యాపితంగా ప్రారంభిస్తున్నామని ఖైరతాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. ఈ మేరకు శుక్రవారం హిమాయత్‌నగర్ డివిజన్‌లోని విఠల్‌వాడి బస్తీలో వార్డు ఆఫీసును మేయర్ గద్వాల విజయలక్ష్మి,కార్పోరేటర్ గడ్డం మహాలక్ష్మిరామన్‌గౌడ్ లతో కలిసి ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ దేశానికే దిక్సూచిలా తెలంగాణ వార్డు ఆఫీసులు మారనున్నాయని అన్నారు. ప్రతి వార్డు ఆఫీసుల్లో 10 శాఖలకు చెందిన ప్రభుత్వ అధికారులు ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటారని తెలిపారు. ప్రజలు ఫిర్యాదుల పట్టుకొని గల్లీగల్లీ తిరగాల్సిన అవసరం లేకుండా ముఖ్యమం త్రి కెసీఆర్, పురపాలక మంత్రి కెటీఆర్ వార్డు ఆఫీసులను అమల్లోకి తెచ్చారని అన్నారు.

దేశంలో ఎక్కడాలేని సరికోత్త పద్ధతిని తెలంగాణా రాష్ట్రంలో ప్రారంభించామని అన్నారు. ఎన్నికల మానిఫెస్టోలో సైతం లేని ఎన్నో పథకాలు కెసీఆర్ ప్రజలకు అందుబాటులోకి తెచ్చారని చెప్పారు. బస్తీదవాఖానాలు, కంటి వెలుగు, మహిళలకు వడ్డీలేని రుణాలు, దళితబంధు పథకం, చేతివృత్తుల వారికి లక్ష రూపాయలు, గృహలక్ష్మి, కళ్యాణలక్ష్మి, షాదీముబారక్, వంటి పథకాలతో ప్రజలను ఆదుకుంటున్న పార్టీ బిఆర్‌ఎస్ అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ హేమలతాయాదవ్, బిజెపి స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ రామన్‌గౌడ్, మల్లేష్, శారధ, అధికారులు జ్యోతిభాయ్, మహేందర్‌రెడ్డి, సబితారాజ్, రవీందర్, అశోక్‌కుమార్, శ్రీకాంత్, రషీద్, అఖిల తదితరులు పాల్గొన్నారు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News