Tuesday, April 30, 2024

కామెడీ విలన్ నర్సింగ్ యాదవ్ పరిస్థితి విషమం..

- Advertisement -
- Advertisement -

 

హైదరాబాద్: తెలుగు సీనియర్ నటుడు నర్సింగ్ యాదవ్ అపస్మారక స్థితిలోకి వెళ్లారు. నిన్న(గురువారం) ఇంట్లో ఉన్నటుండి కుప్పకూలడంతో ఆయనను వెంటనే సోమాజిగూడాలోని యశోద ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉందని, వెంటిలేటర్ పై ఉంచి చికిత్స అందిస్తున్నట్లు సమాచారం. అయితే, నర్సింగ్ యాదవ్ ఇంట్లో అనుకోకుండా కిందపడడంతో తలకు గాయమై కోమాలోకి వెళ్లారని వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని ఆయన భార్య మీడియాకు తెలిపింది. ఇంట్లో ఉన్నట్టుండి అపస్మారక స్ఠితిలోకి వెళ్లడంతో వెంటనే యశోద ఆస్పత్రికి తీసుకొచ్చామని చెప్పారు. కోమాలోకి వెళ్లడంతో డాక్టర్లు 48 గంటల పాటు ఆయన్ను అబ్జర్వేషన్‌లో ఉంచారని తెలిపారు. కాగా, టాలీవుడ్ లో విలన్ గా రాణించిన నర్సింగ్ యాదవ్ పలు సినిమాలో తన కామెడీతోనూ అలరించారు.

Telugu Senior Actor Narsing Yadav Slips into Coma

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News