- Advertisement -
తెలంగాణలో ఎండల తీవ్రత పెరుగుతోంది. అప్పుడప్పుడు వానలు పడినా ఎండలు మాత్రం తగ్గేదేలే అన్నట్లు దంచికొడుతున్నాయి. రానున్న రోజుల్లో మరింతగా విజృంభిచనున్నట్లు వాతావరణ శాఖ కేంద్రం వెల్లడించింది. రాష్ట్రంలో ఇప్పటికే అధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతుండగా.. మే 15 తర్వాత ఎండల తీవ్రత మరింత పెరగనుందని తెలిపింది. ముఖ్యంగా దక్షిణ తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి. రానున్న రోజుల్లో ఎండలకు తోడుగా 30-40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు కూడా వీచే అవకాశం ఉందని పేర్కొంది. 12 జిల్లాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే ఛాన్స్ ఉందని తెలిపింది. ఇక, ఈశాన్య తెలంగాణలో మోస్తరు వర్షాలు పడతాయని అంచనా వేసింది. కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో పలు జిల్లాలకు వాతావరణ కేంద్రం ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది.
- Advertisement -