Sunday, December 15, 2024

ఇథనాల్ ఆగింది

- Advertisement -
- Advertisement -

పరిశ్రమను నిలిపివేయాలని ప్రభుత్వం ఆదేశం ప్రభుత్వానికి, సిఎంకు
నివేదిక ఇచ్చిన కలెక్టర్ గత ప్రభుత్వం ఇచ్చిన అనుమతుల పునఃసమీక్షకు
సర్కార్ నిర్ణయం ఆందోళన విరమించిన గ్రామస్థులు

మన తెలంగాణ/హైదరాబాద్ /దిలావర్‌పూర్: నిర్మల్ జిల్లా దిలావర్‌పూర్‌లో ఇథనాల్ పరిశ్రమ పనులు నిలిపివేయాలని ప్రభుత్వం ఆదేశించిం ది. ఇథనాల్ పరిశ్రమ అనుమతులు, షరతులు, స్థానికుల ఆందోళనపై నిర్మల్ జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ ప్రభుత్వానికి, సిఎం రేవంత్‌కు ని వేదిక ఇచ్చారు. ఇథనాల్ పరిశ్రమ ఏర్పాటుకు గ త ప్రభుత్వ హయాంలో ఇచ్చిన అనుమతులను పునః సమీక్షించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రజల అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకొని స్థానికంగా ఇబ్బందులు తలెత్తకుండా అవసరమై న చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. అవసరమైతే పరిశ్రమ అనుమతులను రద్దు చే యాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లుగా సమాచా రం. తాజాగా ప్రభుత్వ సూచనల మేరకు ఇథనా ల్ ఫ్యాక్టరీ పనులు నిలిపివేయాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. దిలావర్‌పూర్ మండల కేం ద్రంలో ఇథనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా రెండవ రోజు రాస్తారోకో నిర్వహించారు. ఉదయం నుం డి దిలావర్‌పూర్,గుండంపెల్లి గ్రామంలోకి అధిక సంఖ్యలో పోలీసులు చేరుకొని రైతులను, ప్రజలను అరెస్టులు చేసి వివిధ పోలీస్ స్టేషన్‌లకు తరలించారు.

దీంతో ఆగ్రహించిన గ్రామ ప్రజలు పోలీసులకు ఎదురు తిరిగి గ్రామం నుండి వెళ్లాలని ఎదురు తిరిగారు. ఈ సందర్భంగా గుర్తు తెలియని ఆకతాయిలు రాళ్లు రవ్వడంతో పోలీసులు అక్కడ నుండి దూరంగా వెళ్లిపోయారు. పలువురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేయడం పట్ల ఆగ్రహించిన రెండు గ్రామాల ప్రజలు దిలావర్‌పూర్ బస్టాండ్ వద్ద జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మహిళలు మాట్లాడుతూ.. ఇథనాల్ ఫ్యాక్టరీ రద్దు చేసే వరకు రోడ్డుపైనే కూర్చుంటామని పురుగుల మందు డబ్బలతో రాస్తారోకోలో పాల్గొన్నారు. ఫ్యాక్టరీకి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ రెండు రోజులుగా జాతీయ రహదారిపై రాస్తారోకోలు చేసినా ప్రభుత్వం స్పందించడం లేదని మండిపడ్డారు. పచ్చని పంట పొలాల్లో ఫ్యాక్టరీని నిర్మించడం వలన రైతులు అనేక విధాలుగా నష్టపోతారని ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే ఫ్యాక్టరీ రద్దు చేయాలని, లేనిపక్షంలో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంటామని, ఇందుకు ప్రభుత్వం బాధ్యత వహించాల్సి వస్తుందని హెచ్చరించారు.

ఫ్యాక్టరీ రద్దు చేయాలని నాలుగు గ్రామాల నుండి అధిక సంఖ్యలో రైతులు, మహిళలు రాస్తారోకోలో పాల్గొని ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రాస్తారోకో చేస్తున్న రైతులను జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ చర్చలకు రావాలని పిలవడంతో కలెక్టర్ కార్యాలయానికి వెళ్లారు. కలెక్టర్‌తో జరిపిన చర్చలు ఫలించాయి. రెండు రోజులుగా జాతీయ రహదారిని దిగ్బంధిచి నిరసన తెలుపుతున్న విషయాన్ని సిఎంఓ ఆఫీస్‌కు నివేదిక అందించామని, ఇథనాల్ ఫ్యాక్టరీ తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. రైతులు పుకార్లను నమ్మవద్దని, ఎవరైనా అసత్యాలను ప్రచారం చేస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. కలెక్టర్ ఇచ్చిన ఆదేశాల మేరకు జిల్లా ఎస్‌పి జానకి షర్మిల దిలావర్‌పూర్‌లో రాస్తారోకో నిర్వహిస్తున్న రైతుల వద్దకు వచ్చి కలెక్టర్ ఇచ్చిన ఆదేశాలను రైతులకు వివరిస్తూ ఎవరూ ఆందోళన చెందవద్దని, ఫ్యాక్టరీని తాత్కాలికంగా రద్దు చేసినట్లు తెలిపారు. ఈ ప్రకటనతో గ్రామస్థులు బాణసంచా పేలుస్తూ సంబురాలు జరుపుకున్నారు. ధర్నా, రాస్తారోకో సైతం తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు ఆయా గ్రామాల ప్రజలు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News