Sunday, May 5, 2024

దేవాలయ సత్రాలను కూల్చివేయడంతో ఉద్రిక్తత

- Advertisement -
- Advertisement -

మాదన్నపేట్: సైదాబాద్ హనుమాన్ దేవాలయ సత్రాలను కమిటీ సభ్యులకు సమాచారం ఇవ్వకుండా తెల్లవారుజామున ఆర్‌డిఓ వెంకటేశ్వర్లు కూల్చివేయడం జరిగింది. దీంతో హిందువు మనోభావాలు దెబ్బతినడంతో వందలాది మంది భక్తులు అక్కడికి చేరుకున్నారు. హైకోర్టు ఉత్తర్వుల నిబంధనలు పాటించకుండా ఆర్‌డిఓ వ్యవహారించడం పై స్థానిక నాయకులు సౌత్‌ఈస్ట్ జోన్ రూపేష్‌కు ఫిర్యాదు చేశారు. సైదాబాద్ ప్రధాన రహదారి పై 2719 గజాల అత్యంత పురాతనమైన హనుమాన్ దేవాలయం ఉంది. ఇదే రహదారి పై స్టీల్ బ్రిడ్జ్ పనులు జరుగుతున్నాయి.

రోడ్డు విస్తీర్ణంలో భాగంగా దేవాలయ సత్రాలను తెల్లవారుజామున ఆర్‌డిఓ పర్యవేక్షణలో కూల్చివేశారు. విషయం తెలుసుకున్న స్థానికులు, భక్తులు అక్కడి చేరుకున్నారు. స్థానిక నాయకులు చొరువజేసుకోని భక్తులకు నచ్చజెప్పారు. అనంతరం స్థానిక నాయకులు, కమిటీ సభ్యులు సురేందర్ రెడ్డి, సహదేవ్ యాదవ్, రవిందర్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, నిరంజన్ యాదవ్, తంగెళ్ల సుధీర్, రాజేష్, వినోద్, మోహన్‌క్రిష్ణా, అభిషేక్‌లు డిసిపిని కలిసి ఆర్‌డిఓ పై ఫిర్యాదు చేశారు. ఆర్‌డిఓ పై చర్యలు తీసుకోకపోతే సైదాబాద్ ప్రధాన రహదారి పై భారీ ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడుతామని హెచ్చరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News