Thursday, May 2, 2024

ఉగ్ర కుట్రను భగ్నం చేసిన భద్రతాదళాలు

- Advertisement -
- Advertisement -

Terrorist hideout busted in Poonch in Kashmir

న్యూఢిల్లీ: జమ్మూ కాశ్మీర్‌లోని పూంచ్ జిల్లాలో భద్రతా దళాలు ఆదివారం ఒక ఉగ్రవాద రహస్య స్థావరాన్ని వెలికి తీశాయి. ఉగ్ర కుట్రను భద్రతాదళాలు భగ్నం చేసినట్టు తెలుస్తోంది. జమ్ము-ఫూంఛ్ జాతీయ రహదారిపై భద్రతా దళాలపై దాడికి ప్రయత్నించాయి. ముందస్తు సమాచారంతో సైన్యం, పోలీసులు గాలింపు చర్యలు చేపట్టాయి. పూంఛ్ జిల్లా ఫాగ్ లా వద్ద ఉగ్రవాదుల స్థావరాన్ని భద్రతా దళాలు గుర్తించాయి. ఉగ్రవాదుల స్థావరంలో 19 గ్రనేడ్ లను స్వాధీనం చేసుకున్నట్టు సంబంధిత ఉన్నతాధికారులు తెలిపారు. సురన్‌కోట్‌లోని ఫగ్లా ప్రాంతంలో ఆర్మీ, పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్‌లో ఎవరినీ అరెస్టు చేయలేదని ప్రతినిధి తెలిపారు. ఫాగ్లా ప్రాంతంలో రాష్ట్రీయ రైఫిల్స్, పోలీసులు సమన్వయంతో సంయుక్తంగా ఆపరేషన్ ప్రారంభించారు.

 

Terrorist hideout busted in Poonch in Kashmir

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News