Sunday, April 28, 2024

రాజ్యాంగం ప్రకారమే..

- Advertisement -
- Advertisement -

Tests were also conducted in Urdu in combine state

ఉమ్మడి రాష్ట్రంలోనూ ఉర్దూలో పరీక్షలు జరిగాయి

బిజెపి నేతలు అవగాహనతో మాట్లాడాలి
వాస్తవాలను వక్రీకరించొద్దు
యువతను రెచ్చగొట్టొద్దు
ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్‌కుమార్

మన తెలంగాణ/ హైదరాబాద్ : భారత రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్‌లొ పొందుపరిచిన 22 భాషల్లో ఏ భాషలోనైనా సివిల్ సర్వీసెస్ పరీక్షలు, ఆయా రాష్ల్రాల పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలు రాసే హక్కు భారత పౌరులకు ఉంటుందని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు. వాస్తవాలు తెలుసుకోకుండా, రాజ్యాంగం పట్ల అవగాహన లేకుండా బెజెపి ఎంపీలు బండి సంజయ్, ధర్మపురి అరవింద్ యువతను రెచ్చగొట్టే విధంగా మాట్లాడడం విచారకరమని ఆయనన్నారు. పార్లమెంటు సభ్యులుగా ఎన్నికైన బండి సంజయ్, అరవింద్‌లకు రాజ్యాంగం పట్ల అవగాహన లేక పోవడం విచారకరమన్నారు. వాస్తవాలను వక్రీకరించి యువతలో విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా మాట్లాడడం బాధకరమని పేర్కొన్నారు.

ప్రధాని నరేంద్రమోడి ప్రభుత్వ హాయంలో జారీ అయిన యుపిఎస్సీ పరీక్షల షెడ్యూల్, నోటిఫికేషన్లో కూడా ఐఎఎస్, ఐపిఎస్, ఐఎఫ్‌ఎస్ వంటి ఉద్యోగాల కోసం ఉర్దూలో పరీక్షలు రాస్తున్నారని వినోద్ కుమార్ తెలిపారు. ఉర్దూలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలు రాయడం గురించి కొత్తగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఏమీ కాదన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఉర్దూలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలు నిర్వహించారని గుర్తు చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏవైనా రాజ్యాంగానికి లోబడి వ్యవహరించాల్సి ఉంటు్ందని వినోద్ కుమార్ స్పష్టం చేశారు. వాస్తవాలను తెలుసుకోకుండా యువతను రెచ్చగొట్టడం మానుకోవాలని ఆయన బిజెపి నేతలకు హితువు పలికారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News