Tuesday, April 30, 2024

2021 ఎమ్మీ అవార్డుల్లో ‘ద క్రౌన్’దే హవా!

- Advertisement -
- Advertisement -

Emmy award
కేలిఫోర్నియా: అమెరికా ప్రైమ్‌టైమ్ టెలివిజన్‌లో అద్భుత ప్రదర్శన కనబరిచిన వారికి అకాడమీ ఆఫ్ టెలివిజన్ ఆర్ట్ అండ్ సైన్స్(ఎటిఎఎస్) ‘ఎమ్మీ అవార్డులు’ ఇస్తుంది. అయితే ఈ 73వ ఎమ్మీ అవార్డులు(2021) ప్రదానోత్సవం ఆదివారం రాత్రి జరిగింది. నెట్‌ఫ్లిక్స్ సంస్థ ఈ కార్యక్రమం నిర్వహించింది. మొత్తం 43 బహుమతులు ప్రదానం చేశారు.
ఎమ్మీ అవార్డుల ఏడు కెటగిరీల్లో ‘ది క్రౌన్’ డ్రామా సిరీస్ ఏడింటికి ఏడు గెల్చుకుని క్లీన్ స్వీప్ చేసింది. ఆ నాటకంలోని ప్రధాన నటుడు జోష్ ఓ కోనర్, ప్రధాన నటి ఓలివియా కాల్మన్, సహాయ నటుడు టోబియాస్ మెంజిస్, సహాయ నటి గిల్లియన్ ఆండర్సన్, ఉత్తమ డైరెక్టింగ్-జెస్సికా హబ్స్, ఉత్తమ రచన-పీటర్ మోర్గన్…అవార్డులను కైవసం చేసుకున్నారు. ఉత్తమ డ్రామా సిరీస్-ద క్రౌన్, ఉత్తమ కామెడీ సిరీస్-టెడ్ లాసో, ఉత్తమ ఆంథాలజీ సిరీస్- ద క్వీన్స్ గ్యాంబిట్, ఉత్తమ వెరైటీ టాక్ సిరీస్-లాస్ట్ వీక్ టునైట్ విత్ జాన్ ఓలివర్, ఉత్తమ వెరైటీ స్పెషల్(ప్రీ-రికార్డెడ్)-హ్యామిల్టన్… అవార్డులు గెలుచుకున్నాయి.
ఇక లిమిటెడ్ లేక ఆంథాలజీ సిరీస్ లేక మూవీ కేటగిరి అవార్డుల్లో ‘మేర్ ఆఫ్ ఈస్ట్‌టౌన్’లో ప్రధాన నటిగా నటించిన కేటే విన్స్‌లెట్ ఉత్తమ నటి అవార్డు అందుకుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News