Thursday, May 2, 2024

580 ఏళ్ల రికార్డు.. మూడున్నర గంటల చందర్‌వండర్

- Advertisement -
- Advertisement -

The longest lunar eclipse is on Nov 19th

 

కొల్‌కతా : ఈ నెల 19వ తేదీన అత్యంత సుదీర్ఘ చంద్ర గ్రహణం ఖగోళ కీలక పరిణామంగా సంభవించనుంది. 580 సంవత్సరాల కాలంలో అత్యంత ఎక్కువ సేపు ఉండే ఈ చంద్ర గ్రహణం భారతదేశ ఈశాన్య ప్రాంతంలో కన్పిస్తుందని ఖగోళభౌతికవేత్త దేబిప్రోసాద్ దురయి వార్తా సంస్థలకు తెలిపారు. ఈ అరుదైన ఖగోళ పరిణామాన్ని అరుణాచల్ ప్రదేశ్, అసోంలలో తిలకించేందుకు వీలుంటుంది. ఎంపి బిర్లా ప్లానిటోరియం రిసర్చ్, అకాడమిక్ డైరెక్టర్‌గా దురయి వ్యవహరిస్తున్నారు. ఇది పాక్షిక గ్రహణంగా మధ్యాహ్నం 12.48 కు ఆరంభం అయ్యి, మధ్యాహ్నం 4.17కు ముగుస్తుంది. ఈ విధంగా మొత్తం 3 గంటల 28 నిమిషాలు 24 సెకండ్ల ఈ గ్రహణం 580 ఏండ్లలో అత్యంత సుదీర్ఘ గ్రహణం అవుతోందన్నారు. సూర్యుడు, చంద్రుడు, భూమి అసమగ్రరీతిలో ఒకే కోణంలోకి వచ్చినప్పుడు ఇటువంటి ఖగోళ పరిణామం తలెత్తుతుంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News