Thursday, May 2, 2024

ప్రభుత్వ ఉద్యోగాలకు ఇద్దరు పిల్లల నియమాన్ని సమర్థించిన సుప్రీం కోర్టు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ప్రభుత్వ ఉద్యోగాలకు ఇద్దరు పిల్లల కన్నా ఎక్కువ మంది ఉండరాదన్న రాజస్థాన్ ప్రభుత్వ నియమాన్ని సుప్రీం కోర్టు సమర్థించింది. ఆ నియమం వివక్షపూరితం, రాజ్యాంగ విరుద్ధం కాదని కూడా స్పష్టం చేసింది. రాజస్థాన్ వివిధ సర్వీసుల(సవరణ) నియమాలు, 2001 ఇద్దరు కన్నా ఎక్కువ పిల్లలున్న వారిని ప్రభుత్వ ఉద్యోగానికి అనర్హులను చేసింది.

ఎక్స్-సర్వీస్ మ్యాన్ రామ్ జీ లాల్ జాట్ 2017లో మిలిటరీ నుంచి రిటైర్ మెంట్ అయ్యాక రాజస్థాన్ పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగానికి 2018 మే 25న దరఖాస్తు చేసుకున్నాడు. అయితే సుప్రీంకోర్టు అతడి అప్పీల్ ను కొట్టిపారేస్తూ ఇద్దరు పిల్లల నియమాన్ని ఖరారు చేసింది. న్యాయమూర్తి సూర్య కాంత్ నేతృత్వంలోని న్యాయపీఠం ఇద్దరు పిల్లల నియమానికి అనుకూలంగా తీర్పునిచ్చింది. ధర్మాసనంలోని న్యాయమూర్తులు దీపంకర్ దత్తా, కెవి. విశ్వనాథన్ లు కూడా ఇద్దరు పిల్లల నియమం వివక్షపూరితం, రాజ్యాంగ విరుద్ధం కాదని సమర్థించారు. కోర్టు జోక్యం చేసుకోవలసిన అవసరం కూడా లేదని స్పష్టం చేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News