Tuesday, June 25, 2024

వాటర్ ట్యాంకర్‌ను ఢీ కొన్న ఆర్టీసీ లగ్జరీ బస్సు

- Advertisement -
- Advertisement -

బిక్కనూర్ : 44 వ జాతీయ రహాదారిపై ఉన్న చెట్లకు వాటర్ ట్యాంకర్ ద్వారా నీళ్లు పోస్తుండగా ఆర్టిసీ లగ్జరీ బస్సు వెనుక నుండి వచ్చి బలంగా ఢీ కొట్టిన ఘటన జంగంపల్లి గ్రామ శివారులో గురువారం చోటు చేసుకుంది. వాహనాన్ని ఢీకొట్టిన ఘటనలో ఆర్టీసీ డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డాడు. బస్సులో ఉన్న మరోపది మంది ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయని పోలీసులు తెలిపారు. వివరాలు ఇలా ఉన్నాయి. బిక్కనూర్ మండలంలోని జంగంపల్లి గ్రామ శివారులోని ఏవన్ ధాబా వద్ద జిఎంఆర్ కు చెందిన వాటర్ ట్యాంకర్ ద్వారా డివైడర్ మద్యలో ఉన్న చెట్లకు

నీళ్లుపోస్తూ ఉండగా హైదరాబాద్ నుండి కామారెడ్డి వైపు వెళుతున్న ఆర్టీసీ లగ్జరీ బస్సు వెనుక నుండి వచ్చి ఒక్కసారిగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆర్టీసీ డ్రైవర్ తీవ్రంగా గాయపడగా కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదం లో ఆర్టీసీ బస్సు ముందు భాగం నుజ్జునుజ్జయింది. విషయం తెలుసుకున్న సీఐ సంపత్,ఎస్సై సాయికుమార్ పోలీస్ సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకుని గాయ పడిన వ్యక్తులను ఆంబులెన్స్‌లో కామారెడ్డి ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సాయికుమర్ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News