Friday, May 3, 2024

బహుముఖ ప్రజ్ఞాశాలి సురవరం ప్రతాపరెడ్డి

- Advertisement -
- Advertisement -

వనపర్తి : క్రియాశీల ఉద్యమ కారుడు, గొప్ప కవి, రచయిత, బహుముఖ ప్రఙ్ఞశాలి సురవరం ప్రతాపరెడ్డి అని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి కొనియాడారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా ఆదివారం సమీకృత కార్యాలయాల సముదాయంలో నిర్వహించిన కవి సమ్మేళనం కార్యక్రమానికి మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక కవులకు, కళాకారులకు ప్రభుత్వం సమున్నత స్థానం కల్పించిందన్నారు.

అందుకే మన కవులు, కళాకారులను గుర్తుంచుకుని వారికి సన్మానం చేసుకోవడానికి నేడు సాహిత్య దినోత్సవం జరుపుకుని తెలంగాణలో కీర్తిశేషులైన దిగ్గజ కవులు, రచయితలతో పాటు సమకాలిన కవులను సన్మానం చేసుకోవడం జరుగుతుందన్నారు.
ఉదయం జిల్లా కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్, ఇతర ప్రముఖులతో కలిసి కార్యక్రమానికి జ్యోతి ప్రజ్వలన చేసి అనంతరం 500 మంది కవులతో రచించిన సురవరం తెలంగాణ 3వ కవిత సంపుటిని మంత్రి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రం సిద్ధించి 9 సంవత్సరాలు పూర్తైన సందర్భంగా దశాబ్ది వేడుకలలో భాగంగా కవి సమ్మేళనం కార్యక్రమాలను ఘనంగా నిర్వహించడం జరిగిందన్నారు. తెలంగాణ ఉద్యమంలో ఎందరో సాహితి వేత్తలు, కవులు, రచయితలు వారి సాహిత్యం ద్వారా ప్రజల్లో ఉద్యమ స్ఫూర్తిని అందించారన్నారు. రాజకీయ, సాంఘిక, సంపాదకుడిగా, పరిశోధకుడిగా, పండితుడిగా, రచయితగా, క్రియాశీల ఉద్యమ కారుడిగా బహుముఖ ప్రఙ్ఞశాలి సురవరం ప్రతాప రెడ్డి అని మంత్రి అన్నారు.

ప్రాథమిక హక్కుల గురించి పోరాడారని, అంటరానితనాన్ని రూపుమాపేందుకు కృషి చేశారని ఆయన అన్నారు. తెలంగాణలో కవులే లేరు అన్న నిందా వ్యాఖ్యలను సవాలుగా తీసుకుని గోల్కొండ కవుల సంచిక గ్రంథాన్ని రచించారన్నారు. 1952 సంవత్సరంలో వనపర్తి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటి చేసి గెలుపొందారని అన్నారు. తెలుగు భాషకు, సాంప్రదాయాలకు, వ్యక్తిత్వానికి, ఉనికిని తన రచనల ద్వారా చాటి చెప్పారని ఆయన అన్నారు. తెలుగు కవి, సాహితివేత్త, ఙ్ఞానపీఠ అవార్డు గ్రహీత సి. నారాయణ రెడ్డి అని ఆయన రచించిన విశ్వంభరా కావ్యం ప్రసిద్ధి చెందిందని, ప్రాచీన నాగరికత నుండి ఆధునిక నాగరికత వరకు విశ్వంభరా కావ్యంలో పొందుపరిచిన ఉన్నట్లు మంత్రి సూచించారు. తెలుగు అధికార భాషగా ఏర్పడటానికి, ప్రజల స్థితిగతులలో మార్పు రావాలని, ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని కృషి చేసిన వ్యక్తి అని మంత్రి కొనియాడారు.

ఈ సందర్భంగా సురవరం ప్రతాప రెడ్డి కుటుంబ సభ్యులకు ఆయన కృతఙ్ఞతలు తెలిపారు. జిల్లా పరిషత్ చైర్మన్ ఆర్. లోకనాథ్ రెడ్డి మాట్లాడుతూ సాహితివేత్తలు, రచయితలు, కవులు భాషకు గుర్తింపు చేస్తూ అనగారిన వర్గాల అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు ఆయన తెలిపారు. జిల్లా కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్ మాట్లాడుతూ ఆర్థిక, సామాజిక రంగాల అభివృద్ధికి సాహితివేత్తలు తమ కవితలతో, రచనలతో ప్రజల్లో చైతన్యాన్ని కల్పిస్తారని ఆయన అన్నారు. ఆంధ్రుల సాంఘిక చరిత్ర రచనలు సురవరం ప్రతాప రెడ్డికి కేంద్ర సాహిత్య అకాడమీ నుంచి అవార్డు లభించినట్లు ఆయన తెలిపారు. అనంతరం కూచిపూడి నృత్య ప్రదర్శన, బాల భవన్ చిన్నారులతో, వ్యవసాయ కళాశాల విద్యార్థులతో, వైద్య కళాశాల విద్యార్థులతో నృత్య ప్రదర్శనలు నిర్వహించారు. అంతకు ముందు కవులు తమ కవితా గానంతో అలరించారన్నారు. 55 మంది కవులు కవి సమ్మేళనంలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేసినట్లు ఆయన తెలిపారు.

ఈ సందర్భంగా కవులకు ప్రశంసా పత్రాలను, ఙ్ఞాపికలను అందజేసి వారిని సన్మానించినట్లు తెలిపారు. ముందుగా బతుకమ్మ, డప్పు వాయిద్యాలు, చెక్క భజన, గంగిరెద్దు వంటి వివిధ కళా ప్రదర్శనల ద్వారా మంత్రికి స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మెన్ ఆర్. లోకనాథ్ రెడ్డి, జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్, జిల్లా అదనపు కలెక్టర్ డి. వేణుగోపాల్, రాష్ట్ర గిడ్డంగుల చైర్మెన్ సాయిచంద్, మున్సిపల్ చైర్మన్ గట్టు యాదవ్, డిఈఓ గోవిందరాజులు, డిఐఈఓ జాకీర్ హుస్సేన్, డాక్టర్ వీరయ్య, బలరాం, సురవరం ప్రతాప రెడ్డి, నారాయణ రెడ్డి కుటుంబ స భ్యులు కృష్ణమోహన్ రెడ్డి, కృష్ణవర్ధన్ రెడ్డి, సూరిపేట వెంకటేశ్వర్ రెడ్డి, చెన్నయ్య, రావుల పాటి సీతారాం, సాహితివేత్తలు, కవులు, ర చయితలు, జిల్లా అధికారులు, వైద్య, వ్యవసాయ కళాశాలల విద్యార్థులు, అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News