Sunday, April 28, 2024

నిఘా నేత్రం నిద్రిస్తుంది

- Advertisement -
- Advertisement -

కామారెడ్డి క్రైమ్ : కామారెడ్డి జిల్లా కేంద్రానికి రోజూ జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వేల సంఖ్యలో ప్రజలు పనుల కోసం వస్తుంటారు. మూడు కూడళ్ల కేంద్రంగా పిలువబడే కామారెడ్డి జిల్లా చుట్టుపక్కల నుండి నిత్యం వివిధ రకాల పనుల నిమిత్తం వచ్చివెళుతుంటారు. ప్రధానంగా జిల్లా కేంద్రంలోని పాత బస్టాండ్,కొత్త బస్టాండ్, రైల్వే స్టేషన్ ల ద్వారా అనునిత్యం వ్యాపారస్థులు, ఉద్యోగులు,ప్రజలు ప్రయాణాలు కొనసాగిస్తుంటారు. ఇక్కడ పార్కింగ్ చేస్తున్న ప్రయాణికుల వాహనాల బధ్రత కోసం నిఘా లేకపోవడంతో చోరీలు జరుగుతున్నాయి. ఇలాంటి ప్రదేశాల్లో దొంగతనాలు గాని చోరీలకు పాల్పడకుండా అప్రమత్తంగా ఉండటానికి పని చేసే సిసి కెమెరాలు ఉండాలి.

అలాగే జిల్లా కేంద్రంలోని ప్రధాన వీధుల్లో ఉన్న సిసి కెమెరాలు సైతం పని చేయకపోవడంతో దొంగతనం జరిగినప్పుడు ప్రజలు నష్టపోతున్నారని పలువురు చెబుతున్నారు. పట్టణంలోని ప్ర ధాన కూడళ్లైన నిజాంసాగర్ చౌరస్తా, కొత్త, పాత బస్టాండ్, సిరిసిల్ల రోడ్ లలో ఏర్పాటు చేసిన సిసి కెమెరాలు పని చేయకుండా అలంకారప్రాయంగా మారాయి. జిల్లా కేంద్రంలో నిత్యం ఏదో ఓ చోట ద్విచక్రవాహనాలు చోరీకి గురౌతున్నాయని ప్రజలు అంటుంన్నారు. సిసి కెమెరాల నిర్వహణలో పోలీసులు శద్ద చూపడం లేదని చెబుతున్నారు. జిల్లా కేంద్రంలో స్థంబాలకే సిసి కెమెరాలు పరిమితమైయ్యాయని, పోలీస్ శాఖ అధికారులు సిసి కెమెరాలన్నిటింనీ పరిశీలించి పని చేసే విధంగా చూడాలని ప్రజలు కోరుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News