Thursday, May 2, 2024

రైతు లేనిదే రాజ్యం లేదు

- Advertisement -
- Advertisement -

పిట్లం: రైతన్న లేనిదే రాజ్యం లేదని జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్ షిండే అన్నారు. బుధవారం పిట్లం మండల కేంద్రంలోని స్థానిక అంబేద్కర్ చౌరస్తాలో రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు నిరసనగా రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ అవసరం లేదని అనడం దారుణమన్నారు. రైతు ఏడ్చిన రాజ్యం ఎప్పుడు బాగుపడదన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రైతులకు పంటలకు సాగునీరు అందేలా 24 గంటల పాటు ఉచిత విద్యుత్ అందజేస్తున్న ఏకైక ప్రభుత్వం మా ప్రభుత్వమని అన్నారు.

రైతులకు 24 గంటల కరెంట్ అవసరం లేదని రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు రైతాంగం ఓటుతోనే బుద్ధ్ది చెబుతుందన్నారు. రైతు సంక్షేమం కోసం ఎన్నో పథకాలను ప్రవేశ పెట్టిన రైతులు రాజు చేయాలనే ముఖ్య ఉద్దేశ్యంతో సీఎం కేసిఆర్ పనిచేస్తున్నారన్నారు. రైతులకు పంట పెట్టుబడి ఇబ్బంది లేకుండా రైతులకు సంవత్సరానికి ఎకరాకి పది వేల రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందజేస్తుందని తెలిపారు. రైతు దుర దృష్టవశాత్తు మరణిస్తే కుటుంబానికి ఆదుకోవడానికి రైతుబీమా పథకం ప్రవేశ పెట్టిందన్నారు. రైతు మరణించిన పది రోజుల్లో ఖాతాల్లో డబ్బులు జమ చేయడం జరుగుతుందన్నారు. సీఎం కేసిఆర్ రైతు పక్షపాతి అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కవితా విజయ్, జడ్పీటీసీ శ్రీనివాస్ రెడ్డి, అన్నారం వెంకట్రాం రెడ్డి, సొసైటీ చైర్మన్లు, నాయకులు తదితరులున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News