Sunday, May 5, 2024

ఎసిఎఫ్ఐ మొబైల్ వ్యాన్లను ప్రారంభించిన మంత్రి నిరంజన్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ, సహకార శాఖల మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ACFI ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘జాగో కిసాన్ జాగో’ అవగాహన ప్రచారంలో భాగంగా 10 మొబైల్ వ్యాన్‌లను ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వ విద్యాలయం (పిజెటిఎస్ఏయు) ఆడిటోరియం వద్ద జెండా ఊపి ప్రారంభించారు. నాణ్యమైన వ్యవసాయ దిగుబడి, రైతులకు ఆదాయం మెరుగుపడటానికి నాణ్యమైన వ్యవసాయ ఇన్పుట్స్ (ఆగ్రో కెమికల్స్) ఆవశ్యకత పై అవగాహన మెరుగుపరుస్తూనే నకిలీ లేదా మోసపూరిత ఉత్పత్తుల కొనుగోలును నిరోధించడానికి సరైన రశీదులను పొందడం యొక్క ప్రాముఖ్యత గురించి రైతులకు అవగాహన కల్పించడానికి ఈ ప్రచారం ప్రారంభించారు.

అత్యాధునిక ఆడియోవిజువల్ టెక్నాలజీతో కూడిన ఈ మొబైల్ వ్యాన్‌లు రైతులకు నాణ్యమైన పంట రక్షణ ఉత్పత్తులను ఉపయోగించడం గురించి కీలకమైన సమాచారాన్ని అందజేస్తాయి. దీనితో పాటు అత్యాధునిక ఆధునిక వ్యవసాయ సాంకేతికతలను స్వీకరించడం గురించి రైతులకు అవగాహన కల్పిస్తూనే, సరైన డాక్యుమెంటేషన్‌తో అగ్రి-ఇన్‌పుట్‌లను కొనుగోలు చేయడం యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెబుతాయి. తెలంగాణలో ఈ మొబైల్ వ్యాన్‌లను ప్రారంభించడమనేది ఆగ్రో కెమ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ACFI) దేశవ్యాప్త ప్రచారంలో భాగంగా ఉంది, గతంలో ఇది హర్యానా, మహారాష్ట్రలలో ఈ ప్రచారం చేసింది.

ఈ సందర్భంగా నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ..“తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి నుండి వివిధ రంగాలలో, మరీ ముఖ్యంగా వ్యవసాయ రంగంలో అద్భుతమైన పురోగతిని సాధించామన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి నేతృత్వంలో ప్రారంభించిన ప్రత్యేక పథకాలు, మరీ ముఖ్యంగా రైతు వేదికల కేంద్రాలు పంచాయతీ స్థాయిలో ఏకీకృత పరిష్కారంగా అందుబాటులో వున్నాయి. నీటిపారుదల సౌకర్యాల విస్తరణ, చెరువుల పునరుద్ధరణ కారణంగా పత్తి, వరి విస్తీర్ణంలో గణనీయమైన పెరుగుదల సాధ్యపడింది, ఫలితంగా వ్యవసాయ ఉత్పాదకత మెరుగుపడింది. రైతుల సంపాదన కూడా పెరిగిందన్నారు.

“నీటిపారుదలకి ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు, తెలంగాణ ప్రభుత్వం రైతు సమాజానికి నాణ్యమైన వ్యవసాయ ఇన్‌పుట్‌ల లభ్యతను నిర్ధారించడానికి చురుకైన చర్యలను తీసుకుంది. రైతులకు ఇప్పుడు మేలైన విత్తనాలు, ఎరువులు, వ్యవసాయ రసాయనాలు సులభంగా అందుబాటులో ఉన్నాయి, ఇది వ్యవసాయ రంగానికి మద్దతు అందించటంలో రాష్ట్ర నిబద్ధతను ప్రతిబింబిస్తుంది” అని అన్నారు.

ఎం రఘునందన్ రావు, IAS, APC, తెలంగాణ ప్రభుత్వ సెక్రటరీ (వ్యవసాయ & సహకార శాఖ) మాట్లాడుతూ ఆన్‌లైన్ లైసెన్స్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ (OLMS)ని వ్యవసాయ శాఖ ప్రవేశపెట్టడం వల్ల ఇన్‌పుట్‌ల రంగంలో మరింత విప్లవాత్మక మార్పులు చోటుచేసుకుంటున్నాయన్నారు. తెలంగాణ ఇప్పుడు వేగంగా రైస్ బౌల్ అఫ్ ఇండియాగా అభివృద్ధి చెందుతోందన్నారు.

“రైస్ మిల్లింగ్‌లో ఎదురయ్యే సవాళ్లను పరిష్కరించడానికి, జాప్యాలను తొలగించడానికి, సమర్థవంతమైన ప్రాసెసింగ్‌ను నిర్ధారించడానికి ప్రభుత్వం ఆధునిక, అధిక సామర్థ్యం గల రైస్ మిల్లులను ఏర్పాటు చేస్తోంది” అని రావు తెలిపారు.

ACFI అడ్వైజరీ కమిటీ చైర్మన్, ధనుకా గ్రూప్ చైర్మన్ ఆర్ జి అగర్వాల్ మాట్లాడుతూ తెలంగాణలో ఈ మొబైల్ ఆడియోవిజువల్ వ్యాన్‌ల భారీ ప్రచారం, పురుగుమందుల సురక్షిత వినియోగంపై రైతులకు అవసరమైన శిక్షణను అందించడంలో గణనీయమైన పురోగతిని సాధించగలవన్నారు.

“ఈ వ్యాన్లు అధిక-నాణ్యత పురుగుమందుల సేకరణపై రైతులకు అవగాహన కల్పిస్తాయి, బ్యాచ్ నంబర్లు, గడువు తేదీలు, నిల్వ మార్గదర్శకాలు వంటి వివరణాత్మక సమాచారాన్ని అందించే ఉత్పత్తులను పొందడం యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెబుతాయి. తెలంగాణా ప్రభుత్వం, రైతు వేదికల వద్ద వ్యవసాయ అధికారుల తో కలిసి పని చేస్తూ ఈ వాహనాలు స్థిర మార్గాలలో ప్రయాణిస్తాయి” అని ఆయన చెప్పారు.

ACFI ట్రెజరర్, ఇండోగల్ఫ్ క్రాప్ సైన్స్ ఎండి సంజయ్ అగర్వాల్ మాట్లాడుతూ ఈ ప్రచారం ద్వారా సంస్థ సాధించబోయే లక్ష్యాలను వెల్లడించారు. రైతుల పంట దిగుబడి పెంచుకోవటానికి నాణ్యమైన ఎరువులు, పురుగుమందుల ను అందుబాటులో ఉంచనున్నామన్నారు.

APMAకి కృతజ్ఞతలు తెలిపిన ACFI సెక్రటరీ డాక్టర్ కళ్యాణ్ గోస్వామి మాట్లాడుతూ పంట నిర్వహణ పద్ధతుల్లో తెగుళ్ల నిర్వహణ పద్ధతులను అనుసంధానం చేయడం, ఖాళీ కంటైనర్‌లను సరైన రీతిలో పారవేయడంపై రైతులకు అవగాహన కల్పించడం మరియు వ్యవసాయ రసాయనాల వినియోగానికి సంబంధించిన ఖచ్చితమైన సమయం మరియు పద్ధతులను నొక్కి చెప్పడం ఈ ప్రచారం లక్ష్యమని వివరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News