Wednesday, May 1, 2024

అక్టోబర్- నవంబర్‌లో థర్డ్‌వేవ్ గరిష్ఠ స్థాయి

- Advertisement -
- Advertisement -

Thirdwave peak in October-November

సెకండ్‌వేవ్ తీవ్రతలో నాలుగోవంతు మాత్రమే
ఐఐటి ఖరగ్‌పూర్ నిపుణుల బృందం అధ్యయనం

న్యూఢిల్లీ : ఇప్పుడున్న కొవిడ్ కన్నా సెప్టెంబర్‌లో వైరస్ తీవ్రత ఎక్కువగా ఉంటే అక్టోబర్‌నవంబర్ మధ్యకాలంలో కొవిడ్ గరిష్ఠ స్థాయిలో ఉంటుందని, అయితే సెకండ్ వేవ్ తీవ్రతలో నాలుగో వంతు మాత్రమే కనిపిస్తుందని ఐఐటిఖరగ్‌పూర్ శాస్త్రవేత్త మణీంద్ర అగర్వాల్ అంచనా వేశారు. ముగ్గురు నిపుణులతో కూడిన ఈ బృందం రానున్న నెలల్లో కొవిత్ తీవ్రతను అంచనా వేశారు. కొత్త వేరియంట్ రాకుంటే పరిస్థితిలో అనుకోకుండా మార్పు వస్తుందని చెప్పారు. తర్డ్ వేవ్ పతాక స్థాయికి చేరుకుంటే రోజువారీ కేసులు సెకండ్ వేవ్‌లో రోజువారీ కేసులు 4 లక్షల మాదిరిగా కాకుండా లక్ష వరకే ఉంటాయని నిపుణులు పేర్కొన్నారు.

ఏదెలాగున్న తర్డ్‌వేవ్‌లో డెల్టా వంటి వేరియంట్ వ్యాప్తి ఉండబోదని చెప్పారు. గతవారం ఏదైతే అంచనాగా చెప్పామో అంతేరీతిలో ఇప్పటి అంచనా ఉంటుందని, అయితే తాజా డేటా ప్రకారం రోజువారీ కేసులు స్థాయి మాత్రం తక్కువగా లక్ష నుంచి లక్షన్నర వరకు మాత్రమే ఉంటుందని వివరించారు. జులై ఆగస్టు నెలల్లో వ్యాక్సినేషన్, సీరో సర్వేల ఆధారంగా తాజా డేటాను అగర్వాల్ వెల్లడించారు. ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేథమెటికల్ సైన్సెస్ అధ్యయనం ప్రకారం ఆర్ లేదా కరోనా తాలూకు రిప్రొడక్టివ్ అంశం 0.89 గా పేర్కొనడమైందని ఒకటి కన్నా తక్కువగా ఆర్ ఫ్యాక్టర్ ఉండడం వల్ల ఇన్‌ఫెక్షన్ వ్యాప్తిని అరికడుతుందని చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News