Wednesday, May 1, 2024

యాక్షన్- ప్యాక్డ్ ఎంటర్‌టైనర్

- Advertisement -
- Advertisement -

మరో 17 రోజుల్లో టైగర్స్ హంట్ ప్రారంభమవుతుంది. మాస్ మహారాజా రవితేజ టైటిల్ రోల్‌లో, యంగ్ టాలెంటెడ్ వంశీ దర్శకత్వంలో రూపొందిన పాన్ ఇండియా చిత్రం ’టైగర్ నాగేశ్వరరావు’. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్ నిర్మించిన ఈ చిత్రం ఈనెల 20న గ్రాండ్‌గా థియేటర్స్ లో విడుదల కానుంది. అభిషేక్ అగర్వాల్ ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ చిత్రంలో పలువురు ప్రముఖ నటీనటులు ముఖ్యమైన పాత్రలు పోషిస్తున్నారు.

గత కొద్ది రోజులుగా సినిమాలోని ప్రముఖ పాత్రలందరినీ ఒక్కొక్కటిగా పరిచయం చేసిన మేకర్స్, మోస్ట్ వాంటెడ్ దొంగలకు స్థావరంగా ఉన్న స్టువర్ట్‌పురం వరల్డ్‌ని ప్రేక్షకులకు పరిచయం చేయడానికి రోరింగ్ ట్రైలర్‌తో వచ్చారు. ముంబయ్‌లో జరిగిన గ్రాండ్ ఈవెంట్‌లో ట్రైలర్‌ను విడుదల చేశారు. రెండున్నర నిమిషాల ట్రైలర్‌లో నాగేశ్వరరావు జీవితంలోని కీలక ఘట్టాలను చూపించారు. టైటిల్ రోల్‌లో రవితేజ యంగ్‌గా, డైనమిక్‌గా, వైల్డ్, బ్రూటల్‌గా కనిపించారు. నూపుర్ సనన్, గాయత్రి భరద్వాజ్ ఫీమేల్ లీడ్‌గా కనిపించారు, రేణు దేశాయ్, అనుపమ్ ఖేర్, నాజర్, జిషు సేన్‌గుప్తా, హరీష్ పెరడి, మురళీ శర్మ ఇతర ముఖ్య పాత్రల్లో ఆకట్టుకున్నారు.

టైగర్ నాగేశ్వరరావు యాక్షన్- ప్యాక్డ్ ఎంటర్‌టైనర్. దర్శకుడు వంశీ కథని చూపించిన విధానం యునిక్‌గా వుంది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో పాన్ ఇండియా మూవీగా విడుదల కానున్న ఈ చిత్రానికి మయాంక్ సింఘానియా సహ నిర్మాత. ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో మాస్ మహారాజ రవితేజ మాట్లాడుతూ “టైగర్ నాగేశ్వరరావు సినిమాతో హిందీలోకి రావడం ఆనందంగా వుంది. హిందీకి నేనే డబ్బింగ్ చెప్పాను. టైగర్ నాగేశ్వరరావు తప్పకుండా అందరికీ నచ్చుతుందనే నమ్మకం వుంది”అని అన్నారు.

నిర్మాత అభిషేక్ అగర్వాల్ మాట్లాడుతూ “రవితేజతో సినిమా చేయడం చాలా ఆనందంగా వుంది. దర్శకుడు వంశీ చాలా హార్డ్ వర్క్ చేశారు. చాలా ప్యాషన్‌తో ఈ సినిమాని తీశాము”అని పేర్కొన్నారు. దర్శకుడు వంశీ మాట్లాడుతూ “రవితేజ ఫిల్మ్ లవర్. ఈ సినిమా కోసం చాలా హార్డ్ వర్క్ చేశారు. ఆయన వల్లనే ఈ సినిమా సాధ్యపడింది. దాదాపు 500 పైగా చిత్రాలు చేసిన అనుపమ్‌తో ఈ సినిమాలో పని చేయడం ఆనందంగా వుంది. అలాగే నుపూర్, గాయత్రి, రేణు దేశాయ్ సహా చాలా మంచి నటీనటులతో ఈ చిత్రాన్ని చేశాం. అభిషేక్ చాలా గ్రాండ్‌గా ఈ సినిమా తీశారు”అని తెలిపారు. ఈ ఈవెంట్‌లో అనుపమ్ ఖేర్, గాయత్రి, రేణు దేశాయ్, జిషు సేన్ గుప్తా పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News