Friday, September 20, 2024

నార్సింగిలో రోడ్డు ప్రమాదం.. కారును ఢీకొట్టిన టిప్పర్

- Advertisement -
- Advertisement -

నార్సింగిలో రోడ్డు ప్రమాదం జరిగింది. మై హోమ్ అవతార్ చౌరస్తా వద్ద వేగంగా దూసుకొచ్చిన టిప్పర్ లారీ అదుపుతప్పి కారును ఢీకొట్టిందిొ. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి.  టిప్పర్ లారీలో ఇరుకున్న డ్రైవర్ ను స్థానికులు గంట సేపు శ్రమించి బయటకు తీసి.. హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు.

సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు పరిశీలించారు. కారులో ప్రయాణిస్తున్న సాఫ్ట్ వేర్ ఇంజనీర్లుగా గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కారు రాంగ్ రూట్ లో వచ్చినట్లు సమాచారం. సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించనున్నట్లు నార్సింగ్ పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News