Friday, September 13, 2024

ఒలింపిక్స్‌లో భారత హాకీ జట్టుకు కాంస్య పతకం.. వివేక్ సాగర్ కు భారీ నజరానా

- Advertisement -
- Advertisement -

పారిస్ ఒలింపిక్స్‌లో భారత హాకీ జట్టు కాంస్య పతకం సాధించిన విషయం తెలిసిందే. కాగా, జట్టులో భాగమైన హాకీ ఆటగాడు వివేక్ సాగర్ ప్రసాద్‌కు మధ్యప్రదేశ్ ప్రభుత్వం భారీ నజరానాను ప్రకటించింది. ఈ మేరకు ఎంపి సిఎం మోహన్ యాదవ్ శుక్రవారం వివేక్‌తో ఫోన్‌లో మాట్లాడారు.

దేశానికి పతకం తెచ్చినందకు అభినందనలు తెలిపారు. అంతేగాక మధ్యప్రదేశ్ ప్రభుత్వం తరఫున రూ.కోటి రివార్డుతో పాటు డిఎస్‌పి ఉద్యోగం ఇస్తున్నట్టు వెల్లడించారు. ఇదిలావుంటే గురువారం స్పెయిన్‌తో జరిగిన పోరులో 21 గోల్స్ తేడాతో విజయం సాధించి భారత్ కాంస్య పతకం గెలుచుకుంది. దీంతో దేశవ్యాప్తంగా సంబరాలు జరుగుతున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News