తిరుపతి: తిరుమల పరకామణి వ్యవహారంపై వైసిపి నేత భూమన కరుణాకర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. పరకామణి వ్యవహారంలో సిబిఐతో విచారణ చేయించాలని డిమాండ్ చేశారు. పరకామణిలో చోరీ విషయాన్ని తామే బయటపెట్టామని,
20 ఏళ్లుగా రవికుమార్ అనే వ్యక్తి చోరీ చేస్తున్నాడని, చంద్రబాబు హయాంలో 15 ఏళ్లు చోరీ జరిగిందని విమర్శలు గుప్పించారు. రవికుమార్‌ను తాము వచ్చాకే పట్టుకున్నామని, రవికుమార్ నుంచి రూ.100 కోట్ల ఆస్తులను రికవరీ చేశామని వెల్లడించారు.15 ఏళ్లలో చంద్రబాబు రవి కుమార్ ను ఎందుకు పట్టుకోలేదని ప్రశ్నించారు. కొట్టేయలనుకున్నవారు దొంగను పట్టుకుంటారా? అని ప్రశ్నించారు. రవి కుమార్ వెనక పెద్దల హస్తం ఉందని ఆరోపణలు చేశారు. దమ్ము, ధైర్యం ఉంటే ఈ కేసును సిఐడితో కాదు అని సిబిఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. రవి కుమార్‌కు తమిళనాడు, కర్ణాటక, ఎపిలో ఆస్తులున్నాయని ఆరోపణలు చేశారు. తన బినామీలకు ఆస్తులు రాసి ఇచ్చి ఉంటే సిబిఐ విచారణ జరపించాలని డిమాండ్ చేశారు. తిరుమలను కూటమి ప్రభుత్వం ఆటస్థలంగా మార్చేసిందని చురకలంటించారు.
Also Read: ఆసియా కప్.. నేడు భారత్-పాక్ సూపర్ 4 పోరు..
శనివారం ఒక వ్యక్తి సిసి ఫూటేజీలో దొంగతనం చేస్తున్నట్టుగా ఉందని, టిటిడి దగ్గర వీడియోలు ఉంటాయని, ఈ రోజు విజిలెన్స్ బెదిరించి బ్లాక్ మెయిల్ చేస్తున్నారని దుయ్యబట్టారు. చంద్రబాబు పాలనలో జరిగినవి కూడా బయటపెట్టాలని డిమాండ్ చేశారు. పాత వీడియోలు ఆరేజ్ అయ్యాపోయానని అధికారులు చెప్పడం సరికాదన్నారు. విజిలెన్స్ అధికారులతో దర్యాప్తు చేయించారని, విజిలెన్స్ నివేదికను దమ్ముంటే బయటపెట్టాలని సవాల్ విసిరారు. ఇప్పటివరకు ఎందుకు బయటపెట్టలేదని, దీనికి సంబంధించిన టిడిపి శాసన మండలి సభ్యుడే ప్రశ్నించారని, కానీ దేవాదాయ శాఖ మంత్రి రామనారాయణ రెడ్డి సమాధానం ఇచ్చారని, ఇప్పటి వరకు నివేదిక ఎందుకు బయటకు రాలేదని ప్రశ్నించారు. ఈ నివేదిక గురించి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకి కూడా పూర్తిగా అవగాహన ఉందని, ఎందుకు బయటపెట్టలేదని భూమన బాబును ప్రశ్నించారు.