Sunday, July 21, 2024

నేటి రాశి ఫలాలు.. ఫలితాలు…(03/09/2023)

- Advertisement -
- Advertisement -

మేషం: గృహనిర్మాణ ఆలోచనలో తొందరపాటు వద్దు. ఆకస్మిక ధన, వస్తు లాభాలు పొందుతారు. పనులలో జాప్యం జరిగినా నిదానంగా సకాలంలో పూర్తి చేస్తారు. వృత్లి- ఉద్యోగాల పరంగా అనుకూలంగా ఉంటుంది. ఏ విషయంలోనూ తొందరపాటు నిర్ణయాలు వద్దు.

వృషభం: మిత్రులతో ఏర్పడిన విభేధాలు పరిష్కారమవుతాయి. మానసిక ప్రశాంతత ఏర్పుడుతుంది. ఆదాయానికి మించిన ఖర్చులు పెరుగుతాయి. కొంత వరకు ఆస్థి వివాదాలు తీరి నూతన ఒప్పంద లావాదేవీలు జరుపుతారు. స్నేహితులతో కొంచెం జాగ్రత్త.

మిథునం: నూతన పనులకు శ్రీకారం చుట్టాలని నిర్ణయాలు తీసుకుంటారు. విందు వినోదాలు, శుభకార్యాలలో కుటుంబ సభ్యులతో కలిసి చురుకుగా పాల్గొంటారు. నూతన వాహన యోగం గోచరిస్తుంది. అనాలోచిత ఖర్చులు మాత్రం తధ్యం.

కర్కాటకం: వివాదాలకు, అనవసర విషయాలకు దూరంగా ఉండడం మంచింది. లేనిపోని తలనొప్పులను నెత్తికి ఎక్కించుకోవద్దు. కుటుంబ సభ్యులు చేపట్టిన కార్యాలకు సహాయ సహకారాలు అందిస్తారు. ఉన్నత ఉద్యోగ ప్రాప్తి, మన్ననలు పొందుతారు.

సింహం: చిన్ననాటి మిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు. విందువినోదాలు, శుభకార్యాలలో పాల్గొంటారు. స్థిరాస్థి వివాదాలు సమసిపోతాయి. నూతన ఒప్పందాలు కుదురుతాయి. రానున్న భవిష్యత్తు కోసం కార్యచరణ చేస్తారు. ఆరోగ్య పరంగా స్వల్ప ఒడిదుడుకులు ఉంటాయి.

కన్య: నూతన కాంట్రాక్టులు దక్కించుకుంటారు. చేపట్టిన పనులలో ఆలస్యం అయినా నిదానంగా పూర్తి చేయగలుగుతారు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. విద్యార్థులకు చదువుపై ఏకగ్రత కుదరదు. స్నేహితులతో ఇష్టాగోష్టి వలన పక్కదారి పడుతుంది.

తుల: ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. సన్నిహితుల నుండి శుభ వార్తలు, ఆహ్వానాలు అందుకుంటారు. ఉద్యోగస్తులకు అదనపు బాద్యతలు పెరుగుతాయి. వాటిని సమర్థవంతంగా నిర్వహిస్తారు.అధికారుల మెప్పును పొందుతారు.వస్తు లాభం.

వృశ్చికం: మీలోని ప్రతిభని ఇన్నాళ్లకు గుర్తింపు లభిస్తుంది. సంఘంలో గౌరవ మర్యాదలు పొందుతారు. రెండు, మూడు విధాలుగా ఆర్థిక లాభాలు పొందుతారు. రాజకీయ, కళా, పారిశ్రామిక రంగా వారు సన్మానాలు పొందుతారు.

ధనస్సు: ఆకస్మిక ధన, వస్తు లాభాలు పొందుతారు. ఆర్థిక పరిస్థితి మధ్యస్థంగా ఉన్నాఅవసరాలకు ధనం అందుతుంది. ముఖ్యమైన వ్యవహారాలలో పనులు నిదానంగా పూర్తి చేస్తారు. కొంత మానసిక సంఘర్షణకు లోనవుతారు. ఆరోగ్య పరంగా జాగ్రత్తలు అవసరం

మకరం: శ్రమ అధికంగా ఉంటుంది. విలువైన వస్తువులు, వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. దీర్ఘకాలిక సమస్యలు కొంత వరకు తీరుతాయి.ఆర్థిక పరిస్థితి కొంత వరకు మెరుగుపడుతుంది. తలపెట్టిన కార్యక్రమాలు అసంతృప్తిగా సాగుతాయి.

కుంభం: మీ మాటకు విలువ పెరుగుతుంది. నూతన పరిచయాలు పెరుగుతాయి. సంఘంలో మంచి గుర్తింపు అభిస్తుంది. మీరు చేసే పనులలో ఇతరుల జోక్యం లేకుంటేనే మంచిది. మీ సొంత నిర్ణయాలు, ఆలోచనలు శ్రేయస్కరం. ఉద్యోగులకు ఉన్నత హోదాలు పొందుతారు.

మీనం: సంతానం నూతన విద్య, సాంకేతిక ఉద్యోగవకాశాలు పొందుతారు. చేపట్టిన పనులలో విజయం సాధిస్తారు. విలువైన వస్తువులు, వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. కొంత ఒడిదుడుకులు ఎదురైనా ఎదురొడ్డి నిలబడతారు.

సోమేశ్వర శర్మ : 8466932223,9014126121

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News