Sunday, April 28, 2024

శనివారం రాశి ఫలాలు(13-01-2024)

- Advertisement -
- Advertisement -

మేషం – చేపట్టిన కార్యక్రమాలలో విజయం సాధిస్తారు. ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి. కొత్త మిత్రులు పరిచయమై నూతన కార్యక్రమాలు చేపడతారు.

వృషభం – కొత్త పనులు చేపట్టి సకాలంలో పూర్తి చేస్తారు. దూరప్రాంతాల నుండి కీలక సమాచారం అందుతుంది. బంధువులను కలిసి కష్టసుఖాలను పంచుకుంటారు. నూతన వస్తు కొనుగోలు.

మిథునం –  ఋణాలు కొంత వరకు తీరుతాయి. ముఖ్యమైన పనులలో సన్నిహితులు సాయం అందిస్తారు. ఆరోగ్య సమస్యలు ఎదురైనా అధిగమిస్తారు. సోదరుల నుండి ధన, వస్తు లాభాలు పొందుతారు.

కర్కాటకం – దూరప్రాంతాల నుండి వచ్చిన వార్త కొంత ఆందోళన కలిగిస్తుంది. సోదరులతో ఏర్పడిన విభేదాలు పరిష్కరించుకుంటారు. ఇంటాబయటా సమస్యలు ఎదురైనా అధిగమిస్తారు.

సింహం – వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. పనులలో విజయం సాధిస్తారు. సంఘసేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. ఆర్ధిక పరిస్థితి సంతృప్తికరంగా వుంటుంది. ప్రముఖుల కలయిక.

కన్య – సోదరుల నుండి శుభవార్తలు అందుకుంటారు. వృత్తి, వ్యాపారాలలో అభివృద్ధి సాధిస్తారు. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా వుండును. భూముల క్రయవిక్రయాలలో లాభాలు పొందుతారు.

తుల – వృత్తి, వ్యాపారాలలో స్వల్ప లాభాలు పొందుతారు. అనుకోని అవకాశాలు లభిస్తాయి. ఆరోగ్యం పట్ల జాగ్రత్త అవసరం. ఆర్థిక పరిస్థితి కొంత వరకు మెరుగుపడుతుంది. వాహన యోగం.

వృశ్చికం – ఆస్తి వివాదాలు పరిష్కారమై నూతన ఒప్పందాలు కుదురుతాయి. సోదరులతో ఏర్పడిన తగాదాలు పరిష్కరించుకుంటారు. ఆకస్మిక ప్రయాణాలు లాభిస్తాయి. వస్తు కొనుగోలు.

ధనున్సు – బంధువులను కలిసి ఆనందంగా గడుపుతారు. అనుకోని ఆహ్వానాలు ఆనందం కలిగిస్తాయి. కుటుంబ సమస్యలు తీరతాయి. వృత్తి, వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి. గృహయోగం పొందుతారు.

మకరం – ఋణ వత్తిడులు కొంత వరకు తీరుస్తారు. మిత్రులతో ఏర్పడిన మాటపట్టింపులు తొలగుతాయి. కొన్ని సమస్యలు ఎదురై చికాకు కలిగిస్తాయి. జీవిత భాగస్వామి నుండి సాయం పొందుతారు.

కుంభం – నూతన మిత్రులు పరిచయమై కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తారు. బంధువుల నుండి ధనలాభం పొందుతారు. విలువైన వస్తువులు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. వాహన యోగం ప్రముఖుల కలయిక.

మీనం – ముఖ్యమైన పనులు నిదానంగా వుంటుయి. అనుకోని అహ్వానాలు ఆనందాన్ని కలిగిస్తుంది. ఆరోగ్యం పట్ల జాగ్రత్త అవసరం. ముఖ్యమైన నిర్ణయాలలో తొందరపాటు వద్దు. ఆర్థిక పరిస్థితి అనుకూలం.

సోమేశ్వర శర్మ గారు – వైదిక్ ఆస్ట్రో సర్వీసెస్

9014126121, 8466932225

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News