Wednesday, May 8, 2024

శుక్రవారం రాశి ఫలాలు(19-01-2024)

- Advertisement -
- Advertisement -

మేషం – నూతన కార్యక్రమాలు చేపడతారు. ఆకస్మిక ధనలాభం. సంతానం నుండి విలువైన సమాచారం అందుతాయి. నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి. వృత్తి, వ్యాపారాలలో అభివృద్ధి సాధిస్తారు. వాహనయోగం.

వృషభం – బంధువుల నుండి వచ్చిన ఆహ్వానాలు ఆనందాన్ని కలిగిస్తుంది. వస్తు లాభాలు. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. మిత్రుల నుండి ధనలాభం పొందుతారు. వాహన కొనుగోలు.

మిథునం – ఋణవత్తిడులు పెరిగినా కొంత వరకు తీరుస్తారు. పనులు నిదానంగా సాగుతాయి. ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా అధిగమిస్తారు. జీవిత భాగస్వామి నుండి సాయం అందుతుంది. వస్తు లాభం.

కర్కాటకం – కీలక నిర్ణయాలలో జాప్యం తీసుకుంటారు. ఎంత కష్టపడ్డా ఫలితం ఉండదు. మిత్రులతో ఏర్పడిన విభేదాలు పరిష్కరించుకుంటారు. అరుదైన ఆహ్వానాలు.

సింహం – చిన్ననాటి మిత్రులను కలిసి ఆనందంగా గడుపుతారు. జీవితభాగస్వామి నుండి ఆస్తి లాభం పొందుతారు. నూతన వస్తు వస్త్రాలు కొనుగోలు చేస్తారు. విందు, వినోదాలు.

కన్య – దూరప్రయాణాలలో నూతన మిత్రుల పరిచయాలు. వృత్తి, వ్యాపారాలు, లాభసాటిగా సాగుతాయి. సంతానమునకు నూతన ప్రయత్నాలు అనుకూలిస్తాయి. వాహన సౌఖ్యం పొందుతారు.

తుల – కుటుంబ సభ్యులతో ఏర్పడిన విభేదాలు పరిష్కారమై ఊరట చెందుతారు. వృత్తి, వ్యాపారాలలో ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు. మాటల చాతుర్యంతో అందరినీ ఆకట్టుకొని ముందుకు సాగుతారు.

వృశ్చికం – కుటుంబ సబ్యులను కలిసి ఆనందంగా గడుపుతారు. ఋణవత్తిడులు ఎదురైనా అధిగమిస్తారు. వృత్తి, వ్యాపారాలలో స్వల్ప లాభాలు పొందుతారు. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా వుండును.

ధనుస్సు – నూతన వ్యాపారాలు చేపడతారు. పెట్టుబడులకు తగిన సమయం. మిత్రులను కలిసి ఆనందంగా గడుపుతారు. క్రయవిక్రయాలలో లాభాలు పొందుతారు.

మకరం – ఋణాలు తీరి ఊరట చెందుతారు. మిత్రులతో ఏర్పడిన తగాదాలు పరిష్కరించుకుంటారు. చేపట్టిన పనులలో జాప్యం జరిగినా చివరికి పూర్తి చేస్తారు. వస్తు లాభాలు.

కుంభం – మానసిక ప్రశాంతత. ఆకస్మిక ప్రయాణాలు లాభిస్తాయి. సోదరుల నుండి కీలక సమాచారం అందుతుంది. ఉద్యోగాలలో బదలీలు వండవచ్చు. ప్రముఖుల పరిచయాలు.

మీనం – అనుకున్న పనులలో ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు. భూముల క్రయవిక్రయాలలో స్వల్ప లాభాలు పొందుతారు. ప్రయాణాలలో తొందరపాటు వద్దు. ధనలాభం.

సోమేశ్వర శర్మ గారు – వైదిక్ ఆస్ట్రో సర్వీసెస్

9014126121, 8466932225

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News