Tuesday, May 21, 2024

గురువారం రాశి ఫలాలు(19-10-2023)

- Advertisement -
- Advertisement -

మేషం :- చాకచక్యంతో పనులు సకాలంలో పూర్తి చేస్తారు. గృహనిర్మాణ ఆలోచనలు సఫలీకృతమవుతాయి. సంఘంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. పెట్టబడులకు తగిన లాభాలు పొందుతారు. వస్తు సేకరణ ధ్యేయంగా పూర్తి చేస్తారు.

వృషభం:- పనులలో ఒత్తిడులు ఎదురైన అధిగమిస్తారు. ఋణాలు కొంత వరకు తీరుస్తారు. వివాదాలకు చాలా దూరంగా వుండండి. సోదరుల కలయిక. ఆర్ధిక పరిస్థితి మెరుగు పడుతుంది. బంధువుల నుండి కీలక సమాచారం తెలియవస్తుంది.

మిథునం :- వాహన, భూ-సేకరణ, కొనుగోలు యోగాలు గోచరిస్తున్నాయి. భాగస్వామ్య వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. కొత్త మిత్రులు పరిచయమై సహాయ నహకారాలు అందిస్తారు. విందు, వినోదాలు, శుభకార్యాలలో చురుకుగా పాల్గొంటారు.

కర్కాటకం :- కుటుంబ సభ్యులతో ఏర్పడిన విభేదాలు పరిష్కరించుకొంటారు. ఆస్థి వివాదాలు తీరి లబ్దిపొందుతారు. ప్రయాణాలలో తొందరపాటు తనం వద్దు. ముఖ్యమైన వ్యవహారాలు నిదానంగా సాగుతాయి. స్వల్ప ధనలాభ ప్రాప్తి.

సింహం :- పలుకుబడి కలిగిన వ్యక్తుల పరిచయాలు పెరుగుతాయి. నూతన విద్యా, ఉద్యోగవకాశాలు పొందుతారు. కుటుంబ సభ్యులను కలిసి ఆనందంగా గడుపుతారు.  పెట్టుబడికి  తగిన లాభాలు అర్జిస్తారు. పదుగురిలో మీ ప్రతిభ పాటవాలకు గుర్తింపు లభిస్తుంది.

కన్య:- చిన్ననాటి మిత్రులను కలిసి ఆనందంగా గడుపుతారు. సంఘంలో గౌరవం పొందుతారు. గృహనిర్మాణ ఆలోచనలు కలిసి వస్తాయి. కుటుంబంలో శుభకార్యాల  ప్రస్తావన ఉంటుంది. విలువైన వస్తువులు  కొనుగోలు చేస్తారు. ఆర్ధికాభివృద్ధి ఉంటుంది.

తుల:- వ్యక్తిగత సమస్యలు ఎదురై చికాకులు పెట్టిన అధిగమిస్తారు. ఆకస్మిక ప్రయాణాలలో నూతన మిత్రుల పరిచయాలు ఏర్పడతాయి. ఆర్థిక ఇబ్బందుల నుండి కొంత వరకు బయటపడతారు. ఆరోగ్యం పట్ల మెలకువ అవసరం.

వృశ్చికం :- ఆరోగ్య సమస్యలు ఎదురైన అధిగమిస్తారు. కుటుంబ నభ్యులతో ఏర్పడిన ఆర్ధిక పరమైన లావాదేవీలు అంత తొందరగా సానుకూల పడవు. ముఖ్యమైన పనులలో సన్నిహితులు సాయం అందిస్తారు. వృత్తి-వ్యాపారాలలో స్వల్ప లాభాలు.

ధనుస్సు:- వివాహ, ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. విలువైన వన్తువులు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. దూరప్రాంతాల నుండి వచ్చిన ఆహ్వానాల వలన ఆనందం కలుగుతుంది. పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు. కుటుంబంలో సఖ్యత లోపిస్తుంది.

మకరం :- మానసిక ప్రశాంతత పొందుతారు. ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి. కళా, రాజకీయ రంగాల వారికి సన్మానాలు, సత్కారాలు పొందుతారు. సంతానంనకు ఉన్నత విద్యా, ఉద్యోగ యోగాలు, పదోన్నతలు గోచరిస్తున్నాయి.

కుంభం :- వృత్తి-వ్యాపారాలలో ఎదురైన ఆటుపోట్లు కొంతవరకు తొలుగుతాయి. పనులు నెమ్మదిగా సాగుతాయి. ఉద్యోగస్తులకి కొంత అనుకూల సమయం అని చెప్పవచ్చు. బంధువులతో ఎదురైన వివాదాలు పరష్కరించుకుంటారు. కాంట్రాక్టులు దక్కుతాయి.

మీనం :- కీలకమైన వ్యవహారాలలో ఎదురైన ఆటంకాలు తొలుగుతాయి. నూతన ప్రయత్నాలలో తొందరపాటు వద్దు. ఆచితూచి అడుగులు వేయండి. ఆస్థి వివాదాలు తీర లబ్ధి పొందుతారు. ఉద్యోగులకు పదోన్నతులు పొందుతారు. సన్నిహితుల సలహాలు స్వీకరించండి.

సోమేశ్వర శర్మ గారు – వైదిక్ ఆస్ట్రో సర్వీసెస్

9014126121, 8466932225

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News