Sunday, April 28, 2024

గురువారం రాశి ఫలాలు(21-12-2023)

- Advertisement -
- Advertisement -

మేషం – కుటుంబ సభ్యులతో ఏర్పడిన కలహాలు పరిష్కరించుకొంటారు. సంఘంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. మిత్రుల నుండి వచ్చిన ఆహ్వానాలు ఆనందం కలుగుతుంది. వృత్తి, వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి.

వృషభం – పనులలో జాప్యం జరిగిన చివరికి పూర్తి చేస్తారు. గృహనిర్మాణ ఆలోచనలు కలిసి రావు. కుటుంబ సభ్యుల నుండి కీలక సమాచారం అందుకొంటారు. వివాదాలకు దూరంగా వుండండి.

మిథునం – ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా అధిగమిస్తారు. దూరప్రయాణాలు లాభిస్తాయి. శ్రమపడ్డ ఫలితం దక్కుతుంది. ఆస్తి వివాదాలు తీరి లబ్ధి పొందుతారు. ఉద్యోగాలలో స్వల్ప లాభాలు పొందుతారు.

కర్కాటకం – పనులలో పురోగతి సాధిస్తారు. ఇంటా బయట ప్రోత్సాహం లభిస్తుంది. వృత్తి, వ్యాపారాలలో అభివృద్ధి సాధిస్తారు. ఉద్యోగులకు హోదాలు పొందుతారు. సేవ కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు.

సింహం – కుటుంబ సభ్యులతో ఏర్పడిన తగాదాలు పరిష్కరించుకొంటారు. పనులలో ఏర్పడిన అవంతరాలు కొంతవరకు తొలగుతాయి. ఉద్యోగాలలో స్థానమార్పులు. సోదరుల నుండి స్వల్ప లాభాలు పొందుతారు.

కన్య – దూర ప్రాంతాల నుండి వచ్చిన వార్త ఆనందం కలుగుతుంది. కార్యజయం పొందుతారు. భూ వివాదాలు తీరి నూతన ఒప్పందాలు కుదురుతాయి. విద్యార్థులకు శుభవార్తలు వింటారు.

తుల – వ్యవహారాలలో ఎదురైన ఆటంకాలు తొలుగుతాయి. అనుకోని అవకాశాలు లభిస్తాయి. వాటిని సద్వినియోగం చేసుకుంటారు. కుటుంబ సభ్యుల నుండి కీలక సమాచారం అందుతుంది. సోదరులతో కలిసి విందు,వినోదాలలో పాల్గొంటారు.

వృశ్చికం – చిన్ననాటి మిత్రులను కలిసి ఆనందంగా గడుపుతారు. విందు, వినోదాలు, వృత్తి, వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో ఉన్నత హోదాలు పొందుతారు. పరపతి పెరుగుతుంది. విద్యార్థులు ఒక   ప్రణాళికతో ముందుకు సాగుతారు.

ధనుస్సు – బంధువులను కలిసి కష్టసుఖాలను పంచుకొంటారు. సంతానంనకు నూతన ఉద్యోగప్రాప్తి. ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా వుండును. షేర్లు, భూములు క్రయ విక్రయాలలో లాభాలు పొందుతారు. వాహనాలు నడిపే విషయాల్లో చాలా జాగ్రత్తగా వుండాలి.

మకరం – వివాదాలకు కోపతాపాలకు దూరంగా వుండండి. బంధువుల నుండి ఎదురైన ఒత్తిడులు కొంత వరకు తీరుతాయి. ఉద్యోగాలలో స్థానచలనం. జీవిత భాగస్వామి తరపు వారి నుండి అనవసరపు నిందారోపణలు.

కుంభం – ఆర్థిక పరిస్థితి కొంత మెరుగుపడుతుంది. కుటుంబ సభ్యులను కలిసి ఉల్లాసంగా గడుపుతారు. ఇతరుల విషయాలలో జోక్యం తగదు. దూర ప్రాంతాల నుండి వచ్చిన ఆహ్వానాలు ఆశ్చర్యపరుస్తాయి.  మానసికంగా ఉల్లాసంగా గడుపుతారు.

మీనం – కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన వుంటుంది. ఆకస్మిక ధనలాభం. ఉద్యోగ యత్నాలు సానుకూలంగా వుంటాయి. వృత్తి, వ్యాపారాలు విస్తరిస్తారు. విలువైన వస్తు, వస్త్రాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు.

సోమేశ్వర శర్మ గారు – వైదిక్ ఆస్ట్రో సర్వీసెస్

9014126121, 8466932225

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News