Tuesday, May 14, 2024

ఎన్నికలకు ముందే ఆ చట్టాలు చేయాలి: తొగాడియా

- Advertisement -
- Advertisement -

రాయ్‌పూర్: విస్ఫోటనం చెందబోయే బాంబులా భారత జనాభా పెరిగిపోతోందని విశ్వ హిందూ పరిషద్(విహెచ్‌పి) మాజీ నాయకుడు ప్రవీణ్ తొగాడియా ఆదివారం అన్నారు. జనాభా విస్ఫోటనం వల్ల ప్రతికూల ప్రభావాలు ఉండగలవన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ, హోం మంత్రి అమిత్ షా వచ్చే ఏడాది పార్లమెంటరీ ఎన్నికల కన్నా ముందే జనాభా నియంత్రణ, ఉమ్మడి పౌర స్మృతి(యుసిసి)ని ప్రవేశాపెడతారన్న ఆశాభావాన్ని కూడా ఆయన వ్యక్తం చేశారు.

అంతర్జాతీయ హిందూ పరిషద్ అధ్యక్షుడు అయిన తొగాడియా ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయ్‌పూర్‌లో విలేకరులతో మాట్లాడుతూ ఈ విషయం చెప్పారు. మహాసముండ్ జిల్లాలోని బస్నా ప్రాంతంలో బహిరంగ సభలో ప్రసంగించడానికి ముందు ఆయన విలేకరులతో మాట్లాడారు. అప్పుడు జనాభా నియంత్రణకు సంబంధించి ప్రశ్నించినప్పుడు తొగాడియా ‘పెరుగుతున్న జనాభా, సంతులనం కోల్పోతున్న జనాభా ఓ టైం బాంబు లాంటిది, అది విస్ఫోటనం చెందనప్పుడు నగరాల్లో, గ్రామాల్లో అంతర్యుద్ధం చోటుచేసుకుంటుంది. అందుకనే ఆ పరిస్థితి ఏర్పడక ముందే జనాభా నియంత్రణ చట్టంను రూపొందించాలి’ అన్నారు.

‘జనాభా నియంత్రణ, యుసిసి చట్టాలను చేశాకే ప్రధాని నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ భాయ్ 2024 సార్వత్రిక ఎన్నికలకు వెళతారని నమ్ముతున్నాను. అలాగే కాశీ, మథురలలో మందిరాలు నిర్మిస్తారని నమ్ముతున్నాను. ఈ చర్యలు హిందువులను పరిరక్షించడమేకాక, బిజెపికి ఓట్లను కూడా తెచ్చిపెడతాయి’ అన్నారు. మరో ప్రశ్నకు ఆయన జవాబిస్తూ ‘భారత్ ఇప్పటికే హిందూ దేశం(రాష్ర్ట్), మేము రాజకీయంగా హిందూ రాజ్యాన్ని ఏర్పాటుచేయాలనుకుంటున్నాము. భారత్ హిందువులు అధికంగా ఉన్న దేశం. భారత్‌లో హిందువులు అసురక్షితంగా ఉండేలా మేము చూడదలచుకోలేదు’ అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News