Tuesday, May 14, 2024

మెట్రోసిటీలలో టమాటో బాంబు

- Advertisement -
- Advertisement -

Tomato in Metro Cities is Rs 90 per kg

కిలో రూ 90 దాటి వందకు పరుగు

న్యూఢిల్లీ : దేశంలోని మెట్రో మహానగరాలలో ఇప్పటికే కిలో టమాటో ధర ఏకంగా రూ 93 దాటి దాదాపుగా కొన్ని ప్రాంతాలలో కిలో వంద రేటు పల్కుతోంది. అకాల ఎడతెరిపి లేని వానలతో పంట దెబ్బతింది. టమాటలు కుళ్లిపొయ్యాయి. దీనితో సామాన్యుడు, మధ్యతరగతి వారికి రుచికరం అయిన ఈ వంటకపు సరుకు కొనలేని స్థితి ఏర్పడింది. చాలా రోజులుగా దేశంలోని పలు ప్రాంతాలలో ఇదే దుస్థితి ఉంది. వరదలతో మండీలకు తక్కువ స్థాయిలో సరుకు అందుతోంది. మరో వైపు ఇప్పటికే దెబ్బతిన్న పంటతో కోటా గండిపడిందని ప్రభుత్వ గణాంకాల సమాచారంతో స్పష్టం అయింది. సోమవారం దేశంలో మెట్రోసిటీలలో టమాట ధర కిలో దాదాపు వంద అయిన వైనం స్పష్టం అయింది. సాధారణంగా జనం ఉల్లి వెల్లుల్లి, టమాట కలయికలో తేలిగ్గా కూరలు చేసుకుని తింటుంటారు. పైగా మార్కెట్‌లో ఇతర కూరగాయలతో పోలిస్తే టమాట ధరలు తక్కువగా ఉంటాయి. కానీ ఈసారి పరిస్థితి వేరే గా మారింది. కొల్‌కతాలో రూ 93, చెన్నైలో 60, ఢిల్లీలో 50కి పైగా ధర పలుకుతోంది.

ఒక్క ఢిల్లీ, ముంబైలలో రూ 30 లోపునే కిలో చొప్పున అమ్ముతున్నారు. పంట సాగు రాష్ట్రాలలో అత్యధిక స్థాయి వర్షాలతో దిగుబడి తగ్గింది. చేతికందిన పంట నీట నాని కుళ్లింది. ఈ నెల 16 నాటికి ముంబై మార్కెట్‌కు 241 టన్నుల కన్నా తక్కువ టమాట సరుకు అందింది. వారం రోజుల క్రితం ఇది దాదాపు 300 టన్నుల వరకూ ఉంది. ఇప్పుడు వస్తున్న టమాటలు కూడా నాణ్యమైన రకం రావడం లేదని , దీనితో కుళ్లిన నాసిరకం కాయలను జనం కొనడం లేదని, ఈ విధంగా తాము నష్టపోతున్నామని ఢిల్లీలోని కూరగాయల వ్యాపారి శివలాల్ యాదవ్ తెలిపారు. టమాటలు ఎక్కువగా కాసే మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాలలో దిగుబడి తగ్గింది. దీనితో ధరలకు రెక్కలు వచ్చాయి.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News