Monday, May 13, 2024

టిపిసిసి చీఫ్ రేవంత్‌రెడ్డి రైతులకు క్షమాపణ చెప్పాలి!

- Advertisement -
- Advertisement -
రైతు సంక్షేమం కోసం ప్రభుత్వం ఎంతో పాటుపడుతుంది
కాంగ్రెస్ పాలిత ప్రాంతాల్లో 24 గంటల కరెంటు ఇస్తారా అని ప్రశ్నించిన ఎర్రబెల్లి

హైదరాబాద్:  వ్యవసాయానికి మూడు గంటల విద్యుత్ చాలు అని రైతులను అవమానించేలా టిపిసిసి చీఫ్ రేవంత్ మాట్లాడటంపై పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మండిపడ్డారు. రైతులపై చేసిన వ్యాఖ్యలను రేవంత్ రెడ్డి వెంటనే తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని రైతులకు క్షమాపణ చెప్పి ముక్కు నేలకి రాయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ అంటే కరెంట్ కష్టాలు అన్న మంత్రి కాంగ్రెస్ పాలనలో రైతుల కొడుకులకు పిల్లనిచ్చేవారు కాదని అన్నారు. రైతుల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం పాటుపడుతోందని చెప్పారు. ఉచిత విద్యుత్ కోసం ఇప్పటికే కెసిఆర్ ప్రభుత్వం రూ.12 వేల కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు. రాహుల్ గాంధీకి రైతుల కష్టాల గురించి ఏం తెలుసన్న కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో రైతులకు 24 గంటల కరెంట్ ఇస్తున్నారా అని ప్రశ్నించారు. రైతుల కష్టాలు తెలిసిన వ్యక్తి సీఎం కేసీఆర్ రైతుల కోసం రైతు బంధు, రైతు బీమా, 24 గంటల ఉచిత విద్యుత్ అమలు చేస్తున్నారని కొనియాడారు.
రోడ్ల నాణ్యతను పరిశీలిస్తున్న ఎన్ క్యూఎం టీమ్ అభినందించిన ఎర్రబెల్లి …
క్రమం తప్పకుండా జరిగే పరిశీలల్లో భాగంగా రాష్ట్రంలో ఇటీవల వేసిని పిఎంజిఎస్‌వై రోడ్ల నాణ్యతను ఎన్‌క్యూం(నేషనల్ క్వాలిటీ మానిటర్స్) బృందం పరిశీలిస్తుంది. ఇందులో భాగంగా సోమవారం పాలకుర్తి కొడకండ్ల మధ్య వేసిన పిఎంజిఎస్‌వై డబుల్ రోడ్ పనుల నాణ్యతను ఈ టీమ్ పరిశీలిస్తున్నది. ఇదే సమయంలో అదే దారిలో ఒక కార్యక్రమంలో పాల్గొనడానికి వెళ్లుతున్న ఎర్రబెల్లి ఈటీమ్‌ను గుర్తించారు. అక్కడే పంచాయతీరాజ్ డిఇఇ రామలింగాచారిని అడిగి విషయం తెలుసుకున్నారు. ఈ వెంటనే టీమ్‌తో మాట్లాడి రాష్ట్రంలో రోడ్ల నాణ్యత ఎలా ఉందని ప్రశ్నించారు. వారు సంతృప్తి వ్యక్తం చేయడంతో మంత్రి సంతోష పడ్డి వారిని శాలువతో సత్కరించి అభినందించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News