Tuesday, May 14, 2024

వ్యవసాయంపై అవగాహన లేని టిపిసిసి అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి

- Advertisement -
- Advertisement -

నల్లగొండ: రైతుల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న ముఖ్యమంత్రి కెసిఆర్ నాయకత్వంలోని బిఆర్‌ఎస్ ప్రభుత్వం, వారికోసం ఎన్నో పథకాలు ప్రవేశపెట్టిందని , అందులో భాగంగానే రైతులకు ఉచితంగా 24గంటల నాణ్యమైన విద్యుత్ అందిస్తుంటే ఓర్వలేని టిపిసిపి అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్ నాయకులు ఉచిత విద్యుత్‌పై అబాండాలు మోపుతున్నారని నాగార్జున సాగర్ ఎమ్మెల్యే నోముల భగత్ కుమార్ అన్నారు. మంగళవారం ఉచిత విద్యుత్‌పై టిపిసిసి అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలకు నిరసనగా బిఆర్‌ఎస్ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు కె.తారకరామారావు ఇచ్చిన పిలుపుమేరకు త్రిపురారం మండల కేంద్రంతోపాటు నీలాయిగూడెం ,దుగ్గేపల్లి , పెద్దదేవులపల్లి రైతువేదికల వద్ద రైతులతో కలిసి నిరసన వ్య క్తం చేశారు.

ఈ సందర్భంగా ట్రైకార్ చైర్మన్ ఇస్లావత్ రాంచందర్‌నాయక్ మాట్లాడుతూ ఉ చిత కరెంటుపై కాంగ్రెస్ నాయకులకు దమ్ముంటే సబ్ స్టేషన్‌వారిగా విద్యుత్ వినియోగంపై చర్చకు సిద్దమా అ న్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు కేవలం రాత్రి వేళలో మాత్రమే రైతులకు కరెంటు సరఫరా చే శారని, దీంతో రైతులు పలు ప్రమాదాలకు గురయ్యేవారని అన్నారు. ఈ ప్రాంత ఓట్లతో దీర్ఘకాలం మం త్రిగా, ఎమ్మెల్యేగా వివిద పదవులు అనుభవించిన జానారెడ్డి ఉచిత కరెంటుపై తనవైఖరిని స్ఫష్టం చేయాలని అన్నారు.రైతులు, ప్రజలు విజ్ఞతతో వ్యవహరించి రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్‌కు తగిన గుణపాఠం చెప్పాలని అన్నారు. అంతకుముందు నీలాయి గూడెం రైతు వేదికను ప్రారంభించారు.

ఈ సందర్భంగా గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. ఈకార్యక్రమంలో బిఆర్‌ఎస్ మండల పార్టీ అధ్యక్షులు నరేందర్, సత్యపాల్ ,డిసిసిబి డైరెక్టర్ ధనావత్ జయరాంనాయక్,రాంచంద్రయ్య, కామర్ల జా నయ్య, పామోజు వెంకటాచారి, అనంతరెడ్డి, సర్పంచులు అనుముల శ్రీనివాస్‌రెడ్డి, సుశీల్ నాయక్, కలగాని శ్రవణ్, హనుమంతు నాయక్, ఎంపిటిసి అంబటి రాము,  వెంకటేశ్వర్లు, రాయినబోయిన వెంకన్న, మాద ధనలక్ష్మి, రవినాయక్, ఆర్.వెంకటేశ్వర్లు, ఏఎంసి డైరెక్టర్లు తిక్కనబోయిన నాగరాజు యాదవ్,ఎస్‌కె ఖాసీం, నాయకులు కలకొండ వెంకటేశ్వర్లు, ఇండ్ల నాగరాజు బైరం కృష్ణ, జంగిలి శ్రీనివాస్,రవి నాయక్, నగేష్, చంద్రమోహన్ ,తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News