Saturday, August 9, 2025

హిమాయత్ సాగర్ సర్వీస్ రోడ్డులో రాకపోకల నిలిపివేత

- Advertisement -
- Advertisement -

ఎగువ నుంచి వస్తున్న వరద నీటికి నగర శివారు గండిపేట మండల పరిధిలోని హిమాయత్ సాగర్ నిండు కుండలా మారింది. దీంతో ఎగువ నుంచి వస్తున్న నీటిని దిగువకు విడుదల చేసేందుకు ఇటీవల నాలుగు గేట్లను వదిలారు. నిండుకుండలా మారిన హిమాయత్ సాగర్ జలాశయం నాలుగు గేట్లు ఓపెన్ చేసి నీటిని దిగువకు విడుస్తున్న సంగతి అందరికీ తెలిసిన విషయమే. కాగా వరద ప్రవాహం ఎక్కువ ఉండడంతో హిమాయత్ సాగర్ నుంచి గచ్చిబౌలి వెళ్లే సర్వీస్ రోడ్డును అధికారులు పూర్తిగా నిలిపివేశారు. ఈ రోడ్డు గుండా ప్రయాణం సాగించేవారు ఈ రోడ్డును వినియోగించవద్దని అధికారులు తెలుపుతున్నారు. జలాశయం గేట్లు ఓపెన్ చేయడంతో వాగు పొంగిపొర్లుతుండడం, సర్వీసు రోడ్డుపై పెద్ద ఎత్తున వాటరు వస్తుండడంతో ఈ రోడ్డును అధికారులు పూర్తిగా బ్లాక్ చేశారు. రాజేంద్రనగర్ హిమాయత్ సాగర్ సర్వీస్ రోడ్డులో రాకపోకలు తాత్కాలికంగా నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News