Friday, May 3, 2024

బేగంపేటలో ట్రాఫిక్ ఆంక్షలు

- Advertisement -
- Advertisement -

Traffic restrictions in Begumpet

ఆదేశాలు జారీ చేసిన నగర సిపి సివి ఆనంద్

హైదరాబాద్: నాలా అభివృద్ధిలో భాగంగా కరాచీబేకరి, రసూల్‌పుర, బేగంపేటలోని పికెట్ నాలాపై వంతెన పునః నిర్మాణం చేస్తున్నారు. దీంతో ఆయా ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తూ నగర పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ బుధవారం ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల 21వ తేదీ నుంచి మే 4వ తేదీ వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. వాహనదారులు ట్రాఫిక్ ఆంక్షలను దృష్టిలో పెట్టుకుని ప్రత్యామ్నాయమార్గంలో వెళ్లాలని కోరారు. సిటిఓ జంక్షన్, సెకబాద్ నుంచి రసూల్‌పుర జంక్షన్ వైపు వచ్చే వాహనాలను హనుమాన్ దేవాలయం వద్ద నుంచి పిజి రోడ్, ఫుడ్ వరల్డ్ నుంచి కుడి మలుపు రాంగోపాల్‌పేట్ పిఎస్, మినిస్టర్ రోడ్ వైపు వెళ్లి రసూల్‌పురా టి జంక్షన్‌కు వెళ్లాలి.

కిమ్స్ ఆస్పత్రి నుంచి రసూల్‌పుర టి జంక్షన్ వైపు వచ్చే ట్రాఫిక్ న్యూరాంగోపాల్‌పేట్ పిఎస్ ఎదురుగా సింధీ కాలనీ లేదా పిజి వైపు రైట్ టర్న్ తీసుకోవడానికి అనుమతి లేదు. బేగంపేట ఫ్లైఓవర్ నుంచి వచ్చే ట్రాఫిక్ కిమ్స్ ఆస్పత్రి వైపు రసూల్‌పురా టి జంక్షన్ వద్ద కుడి మలుపు తీసుకోవడానికి అనుమతి లేదు, సిటిఓ జంక్షన్, సికింద్రాబాద్‌కు వెళ్లడానికి అనుమతి లేదు. హనుమాన్ టెంపుల్ నుంచి ఫుడ్ వరల్డ్ రామ్‌గోపాల్‌పేట పిఎస్, రసూల్‌పురా టి జంక్షన్ మధ్య సాగిన వన్ వే చేశారు.
సికింద్రాబాద్ నుంచి సోమాజిగూడ వైపు గూడ్స్ వాహనాలు, ప్రైవేట్ బస్సులు, స్కూల్, కాలేజీ బస్సులకు అనుమతి లేదు.

కిమ్స్‌కు వెళ్లే వారు….
పంజాగుట్ట వైపు నుంచి వచ్చే ట్రాఫిక్ గ్రీన్‌ల్యాండ్స్, బేగంపేట ఫ్లైఓవర్, సిటిఓ ఫ్లైఓవర్, ఫ్లైఓవర్ యూటర్న్, హనుమాన్ టెంపుల్ లేన్, ఫుడ్ వరల్డ్, రామ్‌గోపాల్‌పేట్ పిఎస్ ఎడమ వైపు తిరిగి కిమ్స్ ఆస్పత్రికి వెళ్లాలి.
పంజాగుట్ట ఎక్స్ రోడ్డు, ఖైరతాబాద్ జంక్షన్, ఖైరతాబాద్ ఫ్లైఓవర్, నెక్లెస్ రోటరీ, పివిఎన్‌ఆర్ మార్గ్, నల్లగుట్ట, రబ్, మినిస్టర్ రోడ్, కిమ్స్ ఆస్పత్రి

సికింద్రాబాద్ నుంచి వచ్చే ట్రాఫిక్..
సిటిఓ జంక్షన్, ప్యారడైజ్, రాణిగంజ్ జంక్షన్ కుడి మలుపు, మినిస్టర్ రోడ్, కిమ్స్ ఆస్పత్రికి వెళ్లాలి. కోఠి , ఎంజే మార్కెట్, మెహిదీపట్నం వైపు నుంచి వచ్చే వాహనాలు అంబేద్కర్ విగ్రహం, ట్యాంక్‌బండ్, రాణిగంజ్ జంక్షన్ వద్ద ఎడమ మలుపు, మినిస్టర్ రోడ్, కిమ్స్ ఆస్పత్రి, బుధ్దభవన్, నల్లగుట్ట రబ్, మినిస్టర్ రోడ్, కిమ్స్ ఆస్పత్రికి వెళ్లాలి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News