Tuesday, May 21, 2024

తెలంగాణ మహారాష్ట్రకు రాకపోకలు నిలిపివేత

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: బోధన్ ప్రాంతంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసిన నేపథ్యంలో సాలురా మంజీరా నది ఉగ్రరూపం దాల్చడంతో నీటి ప్రవాహం అధికమైంది. ఎగువ నుంచి వరద నీరు భారీ ఎత్తున వస్తుంది. పాత వంతెనపై నుంచి వరద నీరు ఉదృతంగా ప్రవహిస్తుంది. దీంతో అధికార యంత్రాంగం తెలంగాణ మహారాష్ట్రకు రాకపోకలను నిలిపివేశారు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా మంజీరా ప్రాంతం నుంచి ప్రయాణం సాగించరాదని హెచ్చరికలు జారీ చేశారు. మంజీరా పరివాహక ప్రాంతాలలోని లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు కోరారు. అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేపట్టాలని బోధన్ ఎమ్మెల్యే షకీల్ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News