Saturday, July 27, 2024

ఈ నెలాఖరులోగా జలమండలి లైన్‌మెన్లకు స్థాన చలనం

- Advertisement -
- Advertisement -

water board lineman

 

హైదరాబాద్ : మహానగరానికి తాగునీరు అందించే జలమండలి ఆదాయం పెంచేందుకు ఉన్నతాధికారులు నూతన విధానాలకు శ్రీకారం చుట్టారు. అందులో భాగంగా ఇప్పటికే అక్రమ నల్లా కనెక్షన్ల ఏరివేత, నీటివృధా అరికట్టేందుకు అవగాహన సదస్సులు, కనెక్షన్ల రెగ్యులర్ కోసం విడిఎస్ వంటి పథకాలు ప్రవేశపెట్టి లాబాల బాటలో నడిచేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అక్రమ నల్లా కనెక్షన్ల విషయంలో లైనుమెన్లు ఇష్టానుసారంగా కనెక్షన్లు ఇచ్చి ఉన్నతాధికారులకు తెలియకుండా నెలవారీగా వసూలకు పాల్పడుతున్నారని ఆరోపణలు రావడంతో 10 సంవత్సరాలపైబడిన శాశ్వత ఉద్యోగులను బదిలీ ప్రక్రియ వేగం పెంచారు. గత నెలల్లో 22 డివిజన్ల పరిధిలో పనిచేస్తున్న 486 మంది ఔట్‌సోర్సింగ్ లైన్లు బదిలీ చేశారు. వారితరువాత పర్మినెంట్ ఉద్యోగుల్లో 20సంవత్సరాలు ఒకే చోట పనిచేసేవారికి స్దానంచలనం కల్పించారు.

డిసెంబర్‌లో 65మందిని బదిలీ చేశారు. మరో 510మందిని జనవరి నెలాఖరువరకు వివిధ డివిజన్లకు బదిలీ చేయనున్నట్లు ఉన్నతాధికారులు వివరిస్తున్నారు. ప్రతి డివిజన్‌ల్లో 6 నుంచి 10మందికి వరకు లైన్‌మెన్లు ఉండగా వారిలో ముందుగా ఎక్కువ కాలం పనిచేసేవారిని సాగనంపనున్నారు. రేపటినుంచి సంక్రాంతి పండగలోపు 15 సంవత్సరాలకు పైబడిన,తరువాత 10 ఏళ్లు గడిచిన వారికి బదిలీ ఉంటుంది. చాలామంది లైన్‌మెన్లు తమకు అనుకూలంగా డివిజన్లలో పనిచేసేందుకు యూనియన్ నాయకుల ద్వారా పైరవీలు మొదలు పెట్టారు. పక్కనే ఉన్న డివిజన్లలో బదిలీ చేసే విధంగా చూడాలని కోరుతున్నారు. యూనియన్ నాయకులు కూడా దూర ప్రాంతాలకు పంపిస్తే వారు వెళ్లలేరని సమీపంలోనే ఉన్న డివిజన్లకు పంపాలని ఎండీని కోరారు.

దీనికి ఆయన ఖచ్చితంగా ఎక్కడకు బదిలీ చేస్తే అక్కడకు వెళ్లితీరాల్సిందేనని సూచించడంతో వారు కూడా బదిలీలపై రాజకీయ చేసేందుకు వెనకడుగు వేస్తున్నారు. బోర్డులో జరిగే అవినీతికి కీలక సూత్రదారులు లైనుమెన్లేని అధికారులు గుర్తించడంతో వారి మెడకు బదిలీ ఉచ్చు చుట్టుకుంది. ఫిబ్రవరి 21వరకు విడిఎస్ పథకం గడువు ఉండటంతో ఇప్పటివరకు అక్రమ నల్లా కనెక్షన్ల వివరాలు అందజేయాలని అధికారులు ఆదేశించారు. ఇటీవల బదిలైన వారిని కూడా తమ పరిధిలో ఎన్ని అక్రమ కనెక్షన్లు ఉన్నాయో త్వరగా గుర్తించి క్రమబద్దీకరణ చేసుకునేలా కృషి చేయాలని సూచిస్తున్నారు. లైన్‌మెన్ల బదిలీ ప్రక్రియ పూర్తియిన తరువాత ఏజిఎం. డిజిఎంల బదిలీలపై అధికారులు దృష్టి పెట్టే ఆలోచనలో ఉన్నట్లు ఉన్నతాధికారులు అంతర్గత సంబాషనలో పేర్కొంటున్నారు.

Transfers for water board lineman
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News