Tuesday, April 30, 2024

కేరళలో మొట్టమొదటి సారి ఎఫెరెసిస్ ప్రక్రియతో కరోనా రోగికి చికిత్స

- Advertisement -
- Advertisement -

Treatment of a corona patient with a process of apheresis

 

కొచ్చి: మొట్టమొదటి సారి ఎఫెరెసిస్ (రోగిరక్తాన్ని బయటకు తీసి సరిదిద్దే ప్రక్రియ) విధానం అనుసరించి ప్లాస్మా థెరపీతో కరోనా రోగిని కేరళలో బాగు చేయగలిగారు. త్రిసూర్ సమీపాన గవర్నమెంట్ మెడికల్ కాలేజీ హాస్పిటల్‌లో దాత నుంచి ప్లాస్మా సేకరించి ఎఫెరెసిస్ విధానంతో 51 ఏళ్ల రోగికి చికిత్స చేయ గలిగినట్టు వైద్యాధికారులు తెలిపారు. కరోనా నుంచి కోలుకున్న రోగే రక్తదానం చేయవలసి ఉంటుంది. కేరళ రాష్ట్రంలో ఈ ప్రక్రియను ఉపయోగించడం ఇదే మొదటి సారని, దీనివల్ల రోగి కోలుకోగలుగుతాడన్న నమ్మకం కలుగుతోందని తెలిపారు.

మెడిసిన్, ట్రాన్స్‌ఫ్యూజన్ మెడిసిన్, ఎనస్తీషియా విభాగాల సమన్వయంతో జిఎంసి టెక్నాలజిస్టులు ఈ ప్రక్రియను నిర్వహించారు. ఈ ప్రక్రియ కింద రక్త దాత డేవిస్ ఆంటోనీ రక్తం ఈ సాథనం ద్వారా ప్రవహించిన తరువాత ప్లాస్మా విడిపోయి అదొక్కటే రోగి రక్తప్రవాహం లోకి నరాల ద్వారా చేరింది. ఇతర రక్తభాగాలు దాత రక్తం లోకి మళ్లీ పంపించడమైంది. రక్తదాత డేవిస్ కరోనా నుంచి కోలుకున్న వ్యక్తి కావడం గమనార్హం. గురువారం రాత్రి నుంచి ఈ ప్రక్రియను ప్రారంభించి శుక్రవారం పూర్తి చేశారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News