Friday, May 3, 2024

అసభ్య ఫోటోలతో వేధింపులు.. సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు

- Advertisement -
- Advertisement -

 

మనతెలంగాణ/హైదరాబాద్: యువతి పేరుతో నకిలీ ఇన్‌స్టాగ్రామ్ ఖాతా తెరిచి అసభ్య చిత్రాలు అప్‌లోడ్ చేస్తూ వేధింపులకు దిగుతున్న వారిపై నగర సైబర్ క్రైం పోలీసులు శనివారం బాధితురాలి సోదరుడు ఫిర్యాదు చేశాడు. నగరంలోని నారాయణగూడకు చెందిన యువతికి తెలియకుండా ఆమె పేరుతో ఇన్ట్‌గ్రామ్‌లో నకిలీ ఖాతా తెరిచి దానిలో అసభ్య చిత్రాలు పోస్టు చేస్తున్నారు. దీనిని గుర్తించిన బాధితురాలు తన సోదరుడికి విషయం చెప్పింది. వెంటనే నగర సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Harassment with obscene photos in Hyderabad

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News