Sunday, May 5, 2024

వివాదాల వేటలో ట్రంప్.. సంస్కరణల బాటలో బైడెన్

- Advertisement -
- Advertisement -

Trump in hunt for controversy Biden on path of reform

 

వాషింగ్టన్ : అధ్యక్షునిగా ఎన్నికైన బైడెన్ దేశంలో సంస్కరణలు చేపట్టడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తుండగా, ట్రంప్ వర్గం ఎన్నికల ఘట్టం ఇంకా ముగిసిపోలేదని, కచ్చితంగా, నిజాయితీగా ఓట్ల లెక్కింపు జరగడానికి కావలసిన మార్గాలను వెతుకుతున్నామని చెబుతోంది. నవంబర్ 3న ఎన్నికలు హోరాహోరీగా ముగిసినా ట్రంప్ వర్గం మాత్రం ఎన్నికలపై వివాదాన్ని విడిచిపెట్టడం లేదు. కీలకమైన రాష్ట్రాల నుంచి న్యాయపోరాటానికి దారులు వెతుకుతోంది. ఎన్నికల ఫలితాలను అధ్యక్షుడు ట్రంప్ వర్గం అంగీకరించడానికి ఒప్పుకోవడం లేదంటే ఆయా రాష్ట్రాలు ఓట్లను సరిచూసి మళ్లీ ద్రువీకరించే ప్రక్రియ పూర్తి కాడానికి కొన్ని వారాలు లేదా డిసెంబర్ మధ్య కాలం వరకు పట్టవచ్చు డెమొక్రాటిక్ పార్టీ ఎన్నికలను కాజేయడానికి ప్రయత్నించిందని ట్రంప్ పినాధాన వాదాలు లేవదీస్తున్నారు. 2.36,000 ప్రాణాలను బలిగొన్న కరోనా మహమ్మారిని తుదముట్టించడానికి తనకు మార్గదర్శకం చేసేలా బైడెన్ సోమవారం టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేశారు. ట్రంప్ నుంచి అధికారిక అనుమతి వస్తే తప్ప జనవరి వరకు ప్రస్తుత అధికార యంత్రాంగాన్ని బైడెన్ ఉపయోగించుకుని సాంకేతికంగా ప్రభుత్వవ్యవస్థను బైడెన్ ఏర్పాటు చేయలేరు.

సోమవారం శ్వేతసౌథం ప్రెస్ సెక్రటరీ మెక్ ఎనానీ ఓటర్ల మోసం అంటూ నిరాధార ఆరోపణలు చేశారు. ఓటర్ల ఐడి, సంతకాలు, పౌరసత్వం, నివాసం,అర్హత ఇవన్నీ పరిశీలించే ప్రక్రియలను వ్యతిరేకించే ఏకైక పార్టీ డెమొక్రాటిక్ పార్టీ అని ధ్వజమెత్తారు. పెన్సిల్వేనియాలో ఇవేవీ జరగలేదని ఆరోపించారు. సెనేట్ మెజార్టీ నేత మిచ్‌మెక్ కాన్నెల్ కూడా ట్రంప్‌కు మద్దతు ఇచ్చారు. రానున్న వారాల్లో ఆయా రాష్ట్రాలు ఫలితాలను ధ్రువీకరించే ముందు ఓటింగ్ అక్రమాలపై తప్పనిసరిగా పరిశీలన చేస్తామని అమెరికా అటార్నీ జనరల్ విలియం బార్ వెల్లడించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News