Thursday, May 2, 2024

అమెరికా ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న ట్రంప్

- Advertisement -
- Advertisement -

7 రాష్ట్రాలలో ఆరింట ముందంజ

వాషింగ్టన్: అమెరికా సార్వత్రిక ఎన్నికలు నవంబర్ నెలలో జరుగనున్నాయి. తాజా ఓపినియన్ పోలింగ్ లో 7 రాష్ట్రాలలో ఆరింట అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఎన్నికల ప్రచారంలో ప్రతిపక్ష నేత డోనాల్డ్ ట్రంప్ కన్నా వెనుకబడి ఉన్నారు. దేశ ఆర్థిక తీరు తెన్నులపై ఓటర్లు చాలా నిరాశతో ఉన్నారు. పైగా బైడెన్ సమర్థత, ఉద్యోగాలపై అనేక అనుమానాలు కలిగి ఉన్నారు. వాల్ స్ట్రీట్ జర్నల్ ఈ సర్వేను నిర్వహించింది.

పెన్సిల్వేనియా, మిచిగాన్, ఆరిజోనా, జార్జియా, నేవ్డా, నార్త్ కరోలినా … ఆరు రాష్ట్రాలలో ట్రంప్ 2.8 శాతం పాయింట్లతో ముందంజలో ఉన్నారు. కాగా విస్కాన్సిన్ లో మాత్రం బైడెన్, ట్రంప్ కన్నామూడు పాయింట్లు ఆధిక్యతతో ఉన్నారు.

రియల్ క్లియర్ పోలిటిక్స్ ప్రకారం ప్రధాన జాతీయ ఎన్నికల్లో ట్రంప్, బైడెన్ పోటాపోటీ పోటీపడుతున్నారు. అయితే ట్రంప్ కేవలం 0.8 శాతం పాయింట్లతో కాస్త ముందున్నారు. ‘ది హిల్’ న్యూస్ పేపర్ బుధవారం ఆ ఇద్దరి మధ్య నువ్వా, నేనా(రేజర్ టైట్) పోరుందని పేర్కొంది.  అనేక రాష్ట్రాలు విజేత ఎవరో నిర్ణయిస్తాయని పేర్కొంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News