Saturday, September 20, 2025

భారతీయులకు షాక్ ఇచ్చిన ట్రంప్

- Advertisement -
- Advertisement -

న్యూయార్: భారతీయులకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ షాక్ ఇచ్చారు. కొత్త వీసా దరఖాస్తుల రుసుము పెంపుతో టెక్ సంస్థలపై పెను భారం పడనుంది. హెచ్-1బి వీసా దరఖాస్తులపై వార్షిక రుసుంను లక్ష డాలర్లుగా నిర్ణయిస్తూ కార్యనిర్వాహక ఉత్తర్వుపై ట్రంప్ సంతకం చేశారు. హెచ్1బి వీసా లబ్ధిదారులలో 70 శాతం కన్నా ఎక్కువమంది భారతీయులు ఉన్నారు. హెచ్1బి వీసా ద్వారా భారతీయులు అమెరికాలోకి ఎక్కువగా ప్రవేశిస్తున్నారు. 1990లో అమెరికా హెచ్1బీ వీసా విధానం తీసుకరావడంతో మూడేళ్ల నుంచి ఆరేళ్ల మధ్య కాలానికి మంజూరు చేసింది. ప్రతి సంవత్సరం 85 వేల వీసాలను లాటరీ విధానం ద్వారా జారీ చేస్తుంది. ఇకపై అమెరికా వేదికగా పని చేస్తున్న కంపెనీలు విదేశీ నిపుణులను నియమించుకునేందుకు జారీ చేసే ఒక్కొక్క వీసాపై ఏడాదికి లక్ష డాలర్లు చెల్లించాలని ఉత్తర్వులు జారీ చేశారు. కొత్త హెచ్1బి వీసా విధానంతో భారత్‌తో పాటు చైనాపై తీవ్ర ప్రభావం చూపనుంది.

ఈ సందర్భంగా అమెరికా కామర్స్ సెక్రటరీ హోవర్డ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పనికిరాని వ్యక్తులు అమెరికా రావొద్దని,  హెచ్1బి అప్లికేషన్ ఫీజు పెంచే సమయంలో ఘాటు విమర్శలు చేశారు. ఐటి కంపెనీలు అమెరికన్లనే నియమించుకోవాలని, పనికి రాని వ్యక్తులను అమెరికాలోకి రావడాన్ని ఆపేయాల్సిందేనని హోవర్డ్ స్పష్టం చేశారు. హెచ్1బి వీసాలతో అమెరికా వెళ్లేది ఎక్కువగా భారతీయులే ఉండడంతో హోవర్డ్ వ్యాఖ్యలు వారినే అవమానించే విధంగా ఉన్నాయని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News