Friday, May 3, 2024

ఎల్లుండి ఇంజనీరింగ్ ఎంసెట్ ఫలితాలు

- Advertisement -
- Advertisement -

TS Engineering Eamcet Results on Aug 25

30 నుంచి కౌన్సెలింగ్

మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు ఈ నెల 4,5,6 తేదీలలో నిర్వహించిన ఎంసెట్ ఫలితాలను బుధవారం (ఆగస్టు 25) వెల్లడించనున్నారు. తెలంగాణ, ఎపి రాష్ట్రాల్లో 105 పరీక్షా కేంద్రాల్లో ఇంజనీరింగ్ ఎంసెట్ నిర్వహించారు. వ్యవసాయ, ఫార్మా ఎంసెట్ ఫలితాలను తర్వాత వెల్లడించనున్నారు. ఈ నెల 9,10 తేదీలలో అగ్రికల్చర్ ఎంసెట్ పరీక్షలు జరిగాయి. ఈ నెల 30వ తేదీ నుంచి ఇంజనీరింగ్ కౌన్సెలింగ్ ప్రారంభం కానుంది. సెప్టెంబర్ 9 వరకు ఆన్‌లైన్‌లో ప్రాసెసింగ్ ఫీజు చెల్లించి సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు స్లాట్ బుకింగ్ చేసుకోవాలి. వచ్చే నెల 4 నుంచి 11 వరకు విద్యార్థుల ధ్రువపత్రాల పరిశీలన ఉంటుంది. సర్టిఫికెట్ వెరిఫికేషన్ పూర్తి చేసుకున్న విద్యార్థులు సెప్టెంబర్ 4 నుంచి 13 వరకు వెబ్ ఆప్షన్లు ఎంపిక చేసుకోవాలి. సెప్టెంబర్ 15వ తేదీన మొదటి విడత ఇంజినీరింగ్ సీట్లను కేటాయించనున్నారు. సీట్లు పొందిన విద్యార్థులు వచ్చే నెల 15 నుంచి 20 వరకు ఆన్‌లైన్‌లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News