Monday, May 6, 2024

267 పిపి పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

- Advertisement -
- Advertisement -

TS Logo

నాంపల్లి:తెలంగాణ వ్యాప్తంగా కోర్టుల్లో చాన్నాళ్లుగా భర్తీ ప్రక్రియకు నోచుకుని 267 పబ్లిక్ ప్రాసిక్యూటర్ల పోస్టుల నియమాకాలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ ఆయా పోస్టులను మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఆదివారం నాంపల్లిలోని గెజిటెడ్ భవన్‌లో తెలంగాణ పబ్లిక్ ప్రాసిక్యూటర్ల సంఘం కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సందర్బంగా పీపీల పోస్టుల భర్తీకి సర్కార్ మంజురు చేయడాన్ని సంఘం గౌరవ అధ్యక్షుడు కె.కృష్ణమూర్తి, అధ్యక్షురాలు శారదలు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కెసిఆర్, రాష్ట్ర మంత్రి ఎన్. శ్రీనివాస్ గౌడ్, డీజీపీ మహేందర్ రెడ్డిలకు వారు ధన్యవాదాలు తెలియజేశారు. ఏళ్లుగా కోర్టుల్లో పోలీస్ శాఖ సంబంధించి కేసులను వాదిస్తున్నారు.

సిఎం కెసిఆర్ ప్రత్యేక శ్రద్ద వహించి 267 పబ్లిక్ ప్రాసిక్యూటర్ల పోస్టులను భర్తీకి పాలనపరంగా మంజూరు ఇవ్వడాన్ని వారు ఆనందం వ్యక్తంచేశారు. ఈ నేపధ్యంలో ఆయా పోస్టుల నియమాకాలకు సంబంధించి వెంటనే అధికారికంగా నోటిఫికేషన్‌ను జారీ చేయాలని కోరారు. ఇటీవలు దిశా హత్య తదనంతరం ఘటనల నేపద్యంలో పబ్లిక్ ప్రాసిక్యూటర్లలో వృత్తి నైపుణ్యత, సమర్ధతను మరింత పెంచుకోవాలని కోరారు. పీపీలకు పదోన్నతులు, పోస్టింగులను ఇచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. పోలీసులు నమోదుచేస్తున్న క్రిమినల్ కేసుల తరఫున కోర్టుల్లో వాదనలు వినిపిస్తున్నారని, ఈ దిశగా వారిలో వృత్తిపర ప్రావీణ్యతను మెరుగుపర్చుకోవాలన్నారు. ఈ సమావేశంలో సంఘం ప్రతినిధులు సత్యనారాయణ, నరేశ్‌కుమార్, రాఘవేందర్, మంజుల, నర్సయ్య తదితరులు పాల్గొన్నారు.

TS Govt green signal to 267 Public Prosecutor Recruitment

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News