Saturday, May 18, 2024

19వ తేదీన ఆప్షనల్ హాలీడే

- Advertisement -
- Advertisement -

TS Govt Optional Holiday announced on the 19th

ఈనెల 20వ తేదీన మొహర్రం
సెలవుగా ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం
స్వల్ప మార్పులతో జిఓ జారీ చేసిన సిఎస్

హైదరాబాద్: ఈనెల 20వ తేదీన మొహర్రం సందర్భంగా ప్రభుత్వం హాలీడేను ప్రకటించింది. దీనికి సంబంధించి జిఏడి 1827 జిఓను మంగళవారం విడుదల చేసింది. గతంలో జారీ చేసిన ఉత్తర్వులను సవరిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌కుమార్ కొత్త జిఓను జారీ చేశారు. ముందుగా జారీ చేసిన ఉత్తర్వుల్లో ఈనెల 19వ తేదీన సెలవురోజుగా, 18వ తేదీన ఆప్షనల్ హాలీడేగా ప్రభుత్వం ప్రకటించింది. ప్రస్తుతం మంగళవారం జారీ చేసిన జిఓలో 19వ తేదీన ఆప్షనల్ హాలీడేగా, 20వ తేదీన (శుక్రవారం) మొహర్రంను పురస్కరించుకొని సెలవురోజుగా ప్రకటించడంతో ముస్లింలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News